న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్‌ది తప్పుడు నిర్ణయం.. అసలు విషయం షారుఖ్‌కు తెలుసా?!!

IPL 2020 Auction : Yuvraj Singh Feels 'Releasing Chris Lynn Bad Call By Kolkata Knight Riders'
Releasing Chris Lynn Bad Call By KKR says Yuvraj Singh, Must Send A Message to Shah Rukh Khan

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్‌ను విడుదల చేయాలన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) నిర్ణయం సరైనది కాదు అని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌-2020 వేలానికి ముందు ఫ్రాంచైజీలు అన్ని తమ తమ జట్టులోని స్టార్ ఆటగాళ్లను వదిలేసుకున్న సంగతి తెలిసిందే. విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది.

<strong>ఒమన్‌తో భారత్‌ అమీతుమీ.. ఓడితే ప్రపంచకప్‌ ఆశలు గల్లంతు!!</strong>ఒమన్‌తో భారత్‌ అమీతుమీ.. ఓడితే ప్రపంచకప్‌ ఆశలు గల్లంతు!!

భారంగా మారిన క్రిస్ లిన్‌

భారంగా మారిన క్రిస్ లిన్‌

కొందరు ఆటగాళ్ల వరుస వైఫల్యాలు జట్టుకు భారంగా మారారు. క్రిస్‌ లిన్‌ (రూ. 9.6 కోట్లు)ను కేకేఆర్‌ అత్యధిక మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. అయితే లిన్‌ తన స్థాయి ప్రదర్శన కనబర్చకుండా జట్టుకు భారంగా మారిపోయాడు. దాంతో లిన్‌ను కేకేఆర్‌ వదిలేసుకుంది. అయితే అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు లిన్‌ పేరిటే ఉంది. మరాఠా అరేబియన్స్‌ తరుఫున ఆడిన లిన్‌.. 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అలెక్స్‌ హేల్స్‌ టీ10 అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్‌ చేశాడు.

ఆశ్చర్యంకు గురిచేసింది

ఆశ్చర్యంకు గురిచేసింది

భారీ హిట్టర్‌ లిన్‌ను వదులుకోవడం కేకేఆర్‌ అభిమానులతో సహా యువరాజ్‌కు కూడా ఇష్టం లేదు. లిన్‌ను వదిలేయడం కేకేఆర్‌ బ్యాడ్‌ కాల్‌గా యువీ పేర్కొన్నాడు. ఇది తనకు ఓ జోక్‌గా అనిపిస్తుందన్నాడు. సోమవారం యువరాజ్‌ మాట్లాడుతూ... 'కేకేఆర్‌ క్రిస్ లిన్‌ను విడుదల చేయడం నన్ను ఆశ్చర్యంకు గురిచేసింది. ఫ్రాంఛైజీ అభిమానుల్ని కూడా షాక్‌కు గురి చేసింది' అని అన్నాడు.

కేకేఆర్‌ది తప్పుడు నిర్ణయం

కేకేఆర్‌ది తప్పుడు నిర్ణయం

'ఐపీఎల్‌లో నేను చూసిన ఒక ప్రత్యేక ఆటగాడు లిన్‌. కేకేఆర్‌కు ఎన్నో మంచి ఆరంభాలు ఇచ్చాడు. లిన్‌ను ఎందుకు వదులుకున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అది కేకేఆర్‌ తప్పుడు నిర్ణయం అనుకుంటున్నా. దీనిపై కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌కు మెస్సేజ్‌ ఉందా. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్‌లో లిన్‌ అసాధారణ ఆటగాడు' అని యువీ పేర్కొన్నాడు.

కోచింగ్ చేస్తానేమో

కోచింగ్ చేస్తానేమో

'విదేశీ లీగ్‌లో ఆడటంపై సంతృప్తిగా ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో మరిన్ని లీగ్‌లు రాబోతున్నాయి. వాటిలో కొన్నింటిని ఆడటానికి ఎదురు చూస్తున్నా. ఒక ఏడాది మొత్తంగా ఆడేకంటే.. రెండు మూడు నెలలు క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. రాబోయే కొన్నేళ్లు కూడా ఇలానే చేస్తా. ఆ తర్వాత కోచింగ్ చేస్తానేమో' అని యువీ తెలిపాడు.

Story first published: Tuesday, November 19, 2019, 13:27 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X