న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడాదికి రూ.10 కోట్లు: భారీగా పెరగనున్న రవిశాస్త్రి జీతం

 Ravi Shastri Set to Get a Massive Salary Hike in New Contract: Report

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి జీతం భారీగా పెరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే కపిల్ దేవ్ నాయకత్నంలోని క్రికెట్ సలహా కమిటీ టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి బీసీసీఐ మరో రెండేళ్లు పొడిగింపు ఇచ్చింది.

దీంతో కొత్త ఒప్పందం ప్రకారం రవిశాస్త్రికి సుమారు 20 శాతం మేర జీతం పెర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వేతనం ఏడాదికి సుమారు రూ. 9.5 నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రవిశాస్త్రి బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.8 కోట్లు వేతనం తీసుకుంటున్నాడు.

<strong>సరిగ్గా 25ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డేల్లో సచిన్ తొలి సెంచరీ (వీడియో)</strong>సరిగ్గా 25ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డేల్లో సచిన్ తొలి సెంచరీ (వీడియో)

కొత్త ఒప్పందం ప్రకారం

కొత్త ఒప్పందం ప్రకారం

కొత్త ఒప్పందం ప్రకారం టీమిండియా సహాయక సిబ్బంది వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌కు రూ.3.5 కోట్లు, బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌కు రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కో‌చ్‌గా ఎంపికైన తర్వాత శాస్త్రి మాట్లాడుతూ ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌, 2020లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల‌పై దృష్టి సారించినట్లు చెప్పాడు.

రవిశాస్త్రి మాట్లాడుతూ

రవిశాస్త్రి మాట్లాడుతూ

ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ "వచ్చే రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. 2021లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వాటికి అనుగుణంగా సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యం. మాకు అద్భుత టెస్ట్ జట్టు ఉంది" అని అన్నాడు.

ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాం

ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాం

"ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాం కాబట్టి దానిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. టీ20లో సరికొత్త దృక్పథాన్ని తీసుకురావాలి. ఆటగాళ్ల అద్భుతమైన ప్రతిభను బయటకు తీయాలి. టెస్టు, వన్డే, టీ20 జట్లలోకి చాలామంది యువకులు వస్తున్నారు. వచ్చే రెండేళ్లు జట్టుకు సంధికాలం. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే జట్టును రూపొందించడమే నా పని" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 9, 2019, 15:50 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X