న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో చెత్త గణాంకాలను నమోదు చేసిన టాప్-5 బౌలర్లు వీరే!

ICC Cricket World Cup 2019 : Top 5 Bowlers Who Did Worst Records In World Cup || Oneindia Telugu
Rashid Khan scores ‘century’ against England: Here are 5 most expensive bowlers in WC

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా మంగళవారం ఆప్ఘనిస్థాన్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ని ఆప్ఘన్ అభిమానులు అంత తేలిగ్గా మరిచిపోరు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆప్ఘన్ టాప్ బౌలర్ రషీద్ ఖాన్‌ను అయితే ఓ ఆట ఆడుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విధ్వంసానికి రషీద్ ఖాన్ బలయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 110 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ తన కెరీర్‌లోనే చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌గా రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులిచ్చిన ఆటగాళ్ల విషయానికి వస్తే 1983 ప్రపంచకప్‌(60 ఓవర్లు)లో న్యూజిలాండ్‌ బౌలర్‌ మార్టిన్‌ స్నెడ్డెన్‌ 12 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి వికెట్లేమీ తీయకుండా 105 పరుగులిచ్చాడు. ఈ చెత్త రికార్డుని తాజాగా రషీద్ ఖాన్ అధిగమించాడు.

కాగా, వన్డేల్లో ఆసీస్ బౌలర్‌ మైఖేల్‌ లూయిస్‌ 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పది ఓవర్లకు 113/0 పరుగులు ఇచ్చాడు. తర్వాత పాకిస్థాన్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ 2016లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పది ఓవర్లకు 110/0 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా రషీద్‌ ఖాన్ తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి 110/0 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే...

1983 వరల్డ్‌‌కప్‌లో మార్టిన్‌ స్నెడ్డెన్‌ - న్యూజిలాండ్(12 ఓవర్లు - 105 పరుగులు)

1983 వరల్డ్‌‌కప్‌లో మార్టిన్‌ స్నెడ్డెన్‌ - న్యూజిలాండ్(12 ఓవర్లు - 105 పరుగులు)

1983 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ పేసర్ మార్టిన్‌ స్నెడ్డెన్‌ 12 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 105 పరుగులు సమర్పించుకున్నాడు. కుడిచేతివాటం పేసర్ అయిన మార్టిన్‌ స్నెడ్డెన్‌ న్యూజిలాండ్ జట్టుకు 1980-1990 మధ్య కాలంలో ప్రాతినిథ్యం వహించాడు. అప్పుడు కూడా ప్రత్యర్ధి జట్టు ఇంగ్లాండే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 106 పరుగుల తేడాతో ఓడింది.

2015 వరల్డ్‌కప్‌లో జాసన్ హోల్డర్ - వెస్టిండిస్(10 ఓవర్లు - 104 పరుగులు)

2015 వరల్డ్‌కప్‌లో జాసన్ హోల్డర్ - వెస్టిండిస్(10 ఓవర్లు - 104 పరుగులు)

ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిన మ్యాచ్ ఇది. 2015 వరల్డ్‌కప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఏబీ శివతాండవం చేశాడు. ఈ మ్యాచ్‌లో సఫారీలు 151 పరుగుల తేడాతో విజయం సాధించారు.

2015 వరల్డ్‌కప్‌లో జద్రాన్ - ఆప్ఘనిస్థాన్(10 ఓవర్లు - 101 పరుగులు)

2015 వరల్డ్‌కప్‌లో జద్రాన్ - ఆప్ఘనిస్థాన్(10 ఓవర్లు - 101 పరుగులు)

ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ బౌలర్ జద్రాన్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన జద్రాన్ 2 వికెట్లు తీసి 101 పరుగులు సమర్పించుకున్నాడు. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆప్ఘన్ 142 పరుగులకే ఆలౌట్ కావడంతో 275 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1987 వరల్డ్‌కప్‌లో అషంత డీ మెల్ - శ్రీలంక(10 ఓవర్లు - 97 పరుగులు)

1987 వరల్డ్‌కప్‌లో అషంత డీ మెల్ - శ్రీలంక(10 ఓవర్లు - 97 పరుగులు)

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దులిప్ మెండిస్ వెస్టిండిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లంక పేసర్ అషంత డీ మెల్ 10 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 97 పరుగులు సమర్పించుకున్నాడు. విండిస్ ఆటగాళ్లు హెయిన్స్(102), వివ్ రిచర్డ్స్ (181) సెంచరీలతో చెలరేగారు. దీంతో విండిస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. దీంతో విండిస్ విజయం సాధించింది.

Story first published: Wednesday, June 19, 2019, 12:45 [IST]
Other articles published on Jun 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X