న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ డిస్ అడ్వాంటేజ్ తొలగించాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతిని మార్చాలి: కేఎల్ రాహుల్

PBKS captain KL Rahul asks for ball change in the second innings to avoid huge disadvantage

ముంబై: మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తున్న తేమ(డ్యూ) ప్రభావాన్ని తగ్గించాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతిని మార్చాలని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. డ్యూ ప్రభావం కారణంగా 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బౌలర్లు కాపాడలేకపోయారు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాహుల్.. తేమ ప్రభావం ఎక్కవగా ఉండే వాంఖడే వంటి మైదానాల్లో సెకండ్ ఇన్నింగ్స్‌లో పదే పదే బంతిని మార్చే వెసులు బాటు కల్పించాలన్నాడు. ఓడిపోయానన్న బాధలో ఈ మాట చెప్పడం లేదని, ఇలా చేస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టుకు ఉన్నా డిస్ అడ్వాంటేజ్‌ను తొలగించవచ్చన్నాడు.

 ఓడిపోయానని చెప్పడం లేదు..

ఓడిపోయానని చెప్పడం లేదు..

'వాంఖడే వంటి మైదానాల్లో సెకండ్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. మా బౌలింగ్ యూనిట్ ఈ పరిస్థితులను ముందే ఊహించి దానికి అనుగుణంగా సిద్దమయ్యాం. కానీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీని అడ్డుకోలేకపోయాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెగ్యూలర్‌గా బంతిని మార్చితే ఈ డిస్ అడ్వాంటేజ్‌ను అధిగమించవచ్చనేది నా అభిప్రాయం. అలా చేస్తేనే సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు న్యాయం జరుగుతుంది. నేనేదో ఓడిపోయాననే బాధలో ఈ మాట చెప్పడం లేదు. ఫలితాన్ని డ్యూ ప్రభావం శాసించకుండా చేసేందుకే బంతిని మార్చాలని, సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు ఉన్న డిస్ అడ్వాంటేజ్‌ను తొలగించాలని చెబుతున్నా.

బాల్ మార్చుకునే ..

బాల్ మార్చుకునే ..

బౌలర్లు తడి బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేసినప్పటికీ ఫీల్డ్‌లో తీవ్ర ఒత్తిడి మధ్య రాణించడం చాలా కష్టం అవుతోంది. చాలా సార్లు బంతిని మార్చాలని అంపైర్‌ను అడిగాను. కానీ నిబంధనల్లో బంతిని మార్చే వెసులు బాటు లేదన్నారు. సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు కష్టమవుతున్న నేపథ్యంలో బంతిని మార్చుకునే వెసులుబాటు కల్పించాలి.'అని రాహుల్ సూచించాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో డ్యూ ప్రభావం కారణంగా పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. బంతి పదే పదే జారుతుండటంతో నోబాల్స్ ఎక్కువగా వేసారు.

గర్జించిన గబ్బర్..

గర్జించిన గబ్బర్..

ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్‌డే బాయ్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్మాన్ మెరివాలా, కగిసోరబడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 198 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. ధావన్‌కు తోడుగా పృథ్వీ షా(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), మార్కస్ స్టోయినిస్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీయగా.. రిలే మెరిడిత్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Monday, April 19, 2021, 11:27 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X