Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొంచెం సిగ్గు తెచ్చుకోండి.. పంత్‌ను చూసి నేర్చుకోండి: యువరాజ్ సింగ్

టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తన శిష్యులపై ఫన్నీగా విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట తనకు అండగా నిలిచిన యువీకి రిషబ్ పంత్ ఓ ఖరీదైన గోల్ఫ్ క్లబ్‌ను కానుకగా ఇచ్చాడు. ఈ బహుమతిని అందుకున్న యువీ.. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఇతర యువ ఆటగాళ్లను ట్యాగ్ చేస్తూ, "కొంచెం సిగ్గు తెచ్చుకోండి.. పంత్‌ను చూసి నేర్చుకోండి" అంటూ సరదాగా ఆటపట్టించాడు.

రిషబ్ పంత్ ఎమోషనల్ గిఫ్ట్
గత కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేక టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్.. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు యువరాజ్ సింగ్‌ను కలిసి గైడెన్స్ కోరాడు. యువీ తన మెంటల్ స్ట్రెంత్, కాన్ఫిడెన్స్ పెంచడంలో కీలక పాత్ర పోషించారని రిషబ్ పంత్ భావించాడు. అందుకే కృతజ్ఞతగా, రిటైర్మెంట్ తర్వాత గోల్ఫ్ ఆడుతున్న యువీకి గోల్ఫ్ క్లబ్‌ను గిఫ్ట్‌గా పంపాడు. దీనిపై ఒక నోట్ రాస్తూ.. "ప్రియమైన యువీ పాజీ, మీ సపోర్ట్, గైడెన్స్‌కు ధన్యవాదాలు. గోల్ఫ్ కోర్స్‌లో కలుద్దాం.. లవ్ రిషబ్ పంత్" అని పేర్కొన్నాడు.

Yuvraj Singh Trolls Shubman Gill and Abhishek Sharma Over Rishabh Pant Gift Says Shame on You

గిల్, అభిషేక్ శర్మలను ఆటపట్టించిన యువీ
యువరాజ్ సింగ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన పర్యవేక్షణలో శిక్షణ పొందిన మిగతా కుర్రాళ్లపై సెటైర్లు వేశాడు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్‌ను నంబర్ 2 బేషరమ్ అని, అభిషేక్ శర్మను నంబర్ 1 బేషరమ్ అని సరదాగా పిలుస్తూ.. పంత్‌ను చూసి నేర్చుకోవాలని చురకలు అంటించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్, అబ్దుల్ సమద్, ప్రియాన్ష్ ఆర్య వంటి ప్లేయర్లను కూడా ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రిషబ్ పంత్ ప్రదర్శనపై నిరాశ
యువరాజ్ సింగ్‌తో శిక్షణ పొందినప్పటికీ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 204 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన సగటు 25.50 కాగా.. స్ట్రైక్ రేట్ 128.30గా ఉంది. రిషబ్ పంత్ వైఫల్యంతో పాటు ఆయన జట్టు కూడా 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Story first published: Wednesday, May 6, 2026, 20:45 [IST]
Other articles published on May 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+