అదే మా కొంపముంచింది.. అందువల్లే ఓడిపోయాం: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పరాజయం పాలవ్వడంపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. ముఖ్యంగా జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలే తమ కొంపముంచాయని.. ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా పరుగులు ధారపోశామని వాపోయాడు. తాము అంచనా వేసిన దానికంటే హైదరాబాద్ బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంలో మేం చేసిన తప్పిదాలే కీలక పాత్ర పోషించాయని శ్రేయస్ అయ్యర్ అంగీకరించాడు.
కొంపముంచిన ఫీల్డింగ్ తప్పిదాలు
ఓటమిపై శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఫీల్డింగ్ విభాగంలో జరిగిన పొరపాట్లపై మండిపడ్డారు. "ఈ మ్యాచ్‌లో మేము ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ ఇలా మూడు విభాగాల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభంలోనే కీలకమైన క్యాచ్‌లు వదిలేయడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే హైదరాబాద్ స్కోరు మరో 30 నుంచి 40 పరుగులు తక్కువగా ఉండేది. వికెట్ క్రమంగా స్లో అవుతూ బంతి ఆగుతూ వస్తున్న తరుణంలో, స్కోరును నియంత్రించే అవకాశం ఉన్నా మేము దానిని చేజార్చుకున్నాం. సన్‌రైజర్స్ బ్యాటర్లు అన్ని విభాగాల్లోనూ పరిపూర్ణమైన క్రికెట్ ఆడి గెలుపు ఎలా సాధించాలో మాకు చూపించారు" అని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కూపర్ కాన్లీ వీరోచిత పోరాటం
పంజాబ్ జట్టు ఓడిపోయినప్పటికీ.. యువ ఆటగాడు కూపర్ కాన్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. "కాన్లీ అద్భుతమైన ఆటగాడు. అతని మానసిక దృఢత్వం, మైదానంలో అతను ప్రదర్శించే తెగింపు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. ఒత్తిడి సమయాల్లో భారీ స్కోర్లు సాధించే అసాధారణ నేర్పు అతనికి ఉంది. ఈ రోజు అతను సాధించిన సెంచరీ ఓ గొప్ప ఉదాహరణ.మేటి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతను చూపిన ధైర్యం, ఫియర్‌లెస్ బ్యాటింగ్ అద్భుతం. పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్‌లో లభించిన అతిపెద్ద సానుకూల అంశం కాన్లీ మాత్రమే" అని శ్రేయస్ అయ్యర్ కొనియాడాడు.
తిరిగి పుంజుకుంటామని ధీమా
వరుసగా మూడు ఓటములను చవిచూడటంపై స్పందిస్తూ, జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశాడు శ్రేయస్ అయ్యర్. "మేము ఈ టోర్నమెంట్‌ను చాలా గొప్పగా ప్రారంభించాం. ప్రస్తుతం వరుస ఓటములతో నెగటివ్ ఆలోచనల వైపు వెళ్లకుండా. అదే పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండటం చాలా ముఖ్యం. గత 3 మ్యాచుల్లో మేము ఎక్కడ విఫలమయ్యామో లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటాం. పొరపాట్లను సరిదిద్దుకుని, ఖచ్చితంగా తర్వాతి మ్యాచులో మరింత బలంగా, దృఢ నిశ్చయంతో తిరిగి వస్తామన్న నమ్మకం నాకు ఉంది" అని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications