Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మమతా బెనర్జీ ప్రభుత్వంపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు!

భారత మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ మా క్రీడాశాఖ సహాయ మంత్రి మనోజ్ తివారీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇకపై ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ నిరాకరించడానికి కారణం రూ.5 కోట్లు ఇవ్వకపోవడమేనని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ తన ఐదేళ్ల అనుభవాలను పంచుకున్నారు.

పని చేయనివ్వలేదు..
క్రీడా ప్రపంచం నుంచి వచ్చిన తాను బెంగాల్ క్రీడారంగం కోసం ఎంతో చేయాలని భావించానని.. కానీ క్రీడల శాఖలో తనను కేవలం టీ, బిస్కెట్లు తాగడానికి పరిమితం చేశారని మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అరూర్ బిస్వాస్ తనను అడుగడుగునా అడ్డుకున్నారని.. యువ క్రీడాకారుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలన్న తన ప్రతిపాదనలను తిరస్కరించారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ యోహాన్ బ్లేక్‌తో కలిసి 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' నిర్మించాలన్న ప్లాన్‌ను కూడా కేవలం రూ.5 కోట్ల నిధుల సాకుతో పక్కన పెట్టేశారని మనోజ్ తివారీ మండిపడ్డారు.

Ex-India Star Manoj Tiwary Slams Mamata Banerjee and TMC Over Rs 5 Crore Ticket Demand and Messi Row

మెస్సీ ఉదంతంపై విమర్శలు
2025లో కోల్‌కతాలో జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ కావడానికి, మెస్సీ మధ్యలోనే వెళ్లిపోవడానికి అరూప్ బిస్వాస్ ప్రవర్తనే కారణమని మనోజ్ తివారీ ఆరోపించారు. భద్రతాపరమైన వైఫల్యాలు, నిర్వాహకుల అస్తవ్యస్త తీరు వల్ల మెస్సీ కేవలం 5-10 నిమిషాల్లోనే స్టేడియం వదిలి వెళ్లాల్సి వచ్చిందని.. ఇది రాష్ట్రంలోని క్రీడాభిమానులందరికీ అవమానకరమని అన్నారు. తనను కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని.. తన ఇమేజ్ అంటే భయం వల్లే తనను దూరం పెట్టారని ఆయన పేర్కొన్నారు.

మమతా బెనర్జీపై అసహనం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తన గోడును పట్టించుకోలేదని మనోజ్ తివారీ ఆరోపించారు. తన నియోజకవర్గ సమస్యల గురించి వివరించడానికి కేబినెట్ సమావేశం తర్వాత ఆమెను కలవగా.. కనీసం 20 సెకన్లు కూడా సమయం ఇవ్వకుండా "నాకు వేరే పనేం లేదా?" అని ముఖం మీదే అన్నారని తివారీ వాపోయారు. ఈ ప్రభుత్వం కేవలం అబద్ధపు హామీలతో నడుస్తోందని.. ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తోందని మనోజ్ తివారీ విమర్శించారు.

Story first published: Thursday, May 7, 2026, 10:28 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+