Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఆటగాడు ఇంకా నిద్రపోతున్నాడేమో!: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై సాధించిన ఘనవిజయం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. విజయం అనంతరం తన మనసులోని మాటను పంచుకున్నాడు. టేబుల్ టాపర్‌గా ఉన్న బలమైన పంజాబ్ జట్టును ఓడించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని,, బ్యాటర్ల వీరవిహారం ఈ విజయానికి పునాది వేసిందని ఆయన కొనియాడారు.

ముందే స్కోరును ఊహించం.. అటాకింగే మా మంత్రం!
సన్‌రైజర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ వరుసగా భారీ స్కోర్లు (200+) సాధించడం వెనుక ఉన్న రహస్యాన్ని పాట్ కమిన్స్ వెల్లడించారు. "మా జట్టులో ఆటను నెమ్మదిగా ప్రారంభించడం అనే మాటే ఉండదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్రీజులోకి వచ్చారంటే బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మేము ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇన్ని పరుగులు చేయాలని ఏనాడూ అనుకోం. ఎంత వీలైతే అంత వేగంగా పరుగులను పిండుకోవడమే మా ప్లాన్. ఒకవేళ వికెట్లు పడితే దానికి అనుగుణంగా మధ్యలో మార్పులు చేసుకుంటాం తప్ప, దూకుడును మాత్రం తగ్గించం" అని కమిన్స్ స్పష్టం చేశారు.

Pat Cummins Trolls Travis Head After SRH Goes Top of the Table Says He Might Be Sleeping Details

ఉప్పల్ స్టేడియం - మా కోట!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు అచ్చొచ్చిన వేదికగా మారింది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. "గత రెండేళ్లుగా ఉప్పల్ పిచ్ మా బ్యాటింగ్, బౌలింగ్ శైలికి బాగా సెట్ అవుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇక్కడ బంతి కొంచెం ఆగుతూ వస్తుంది, ఇది మా స్లో బౌలర్లకు, స్పిన్నర్లకు కలిసివచ్చే అంశం. మధ్యాహ్నం మ్యాచుల్లో మేం ఎందుకు తడబడుతున్నామనే దానికి ఒకే సమాధానం.. బహుశా ఆ టైమ్‌లో ట్రావిస్ హెడ్ ఇంకా నిద్రలోనే ఉంటాడేమో (నవ్వుతూ)" అని సరదాగా వ్యాఖ్యానించాడు.

వ్యూహాత్మక బౌలింగ్ ప్లాన్స్
తన బౌలింగ్ వ్యూహాల గురించి వివరిస్తూ.. పవర్ ప్లేలో ప్రత్యర్థిని దెబ్బకొట్టడంపై దృష్టి పెట్టామని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. పంజాబ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేసిన తీరును ఆయన గుర్తు చేసుకున్నాడు. "ఫీల్డింగ్‌లో చిన్న మార్పు చేసి, మిడ్-ఆన్ ప్లేయర్‌ను వెనక్కి పంపి బ్యాటర్‌ను అయోమయానికి గురి చేశాం. ఆ తర్వాత వేసిన బౌన్సర్ ప్లాన్ వర్కవుట్ అయి వికెట్ దక్కింది. జట్టులో నితీష్ రెడ్డి వంటి నమ్మదగ్గ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల కెప్టెన్‌గా నాకు బౌలింగ్‌లో ఆరు నుండి ఏడు ఆప్షన్లు దొరుకుతున్నాయి. ఇది ప్లాన్ 'బి' అమలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది" అని పేర్కొన్నాడు.

కూపర్ కాన్లీపై ప్రశంసలు, టేబుల్ టాపర్ హోదా
ప్రత్యర్థి జట్టులో అద్భుత సెంచరీతో పోరాడిన ఆస్ట్రేలియన్ కుర్రాడు కూపర్ కాన్లీని ప్యాట్ కమిన్స్ ప్రత్యేకంగా అభినందించాఢు. "కాన్లీ అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్‌లో అతను పంజాబ్ బ్యాటింగ్ వెన్నెముకగా మారాడు. ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఇలా రాణించడం గర్వంగా ఉంది" అని కమిన్స్ అన్నాడు. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంపై స్పందిస్తూ.. "నెంబర్ వన్ స్థానంలో ఉండటం ఎప్పుడూ సంతోషమే. ప్రస్తుతం మాకు చిన్న బ్రేక్ దొరికింది, ఈ టాప్ పొజిషన్‌ను ఎంజాయ్ చేస్తాం. ఈ సీజన్ ఖచ్చితంగా మాదే అవుతుందని నమ్ముతున్నా" అని ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, May 7, 2026, 6:00 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+