Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కమిన్స్‌కు సైగలు: కావ్యపాప.. ఏమిటీ హంగామా! (వీడియో)

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సాక్షిగా పంజాబ్ కింగ్స్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టికరిపించి.. సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయం తర్వాత జట్టు యజమాని కావ్యమారన్ రియాక్షన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా తన జట్టు ఓడిపోతే భావోద్వేగానికి లోనయ్య కావ్యమారన్.. ఈ సారి తన సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వైపు వేలితో నంబర్ 1 అని సైగ చేస్తూ.. 'మనమే ఫస్ట్' అని గర్వంగా చెబుతున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శిస్తున్న నిలకడకు ఈ విజయమే నిదర్శనం

ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ విధ్వంసం
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానకి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(69) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించగా.. ఇషాన్ కిషన్(55) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వీరిద్దరి మెరుపులతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించారు. 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ప్రస్తుతం హైదరాబాద్ ప్లేఆఫ్ దిశగా తన ప్రయాణాన్ని అత్యంత సులువు చేసుకుంది.

SRH vs PBKS Kavya Maran Viral Celebration as Sunrisers Hyderabad Hits No 1 in Points Table Video Viral

కూపర్ కాన్లీ వీరోచిత పోరాటం.. పంజాబ్‌కు తప్పని ఓటమి
236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ పోరాడి ఓడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా యువ సంచలనం కూపర్ కాన్లీ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ హైదరాబాద్ చేతుల్లో నుంచి జారిపోతుందేమో అన్నంతగా ఆడాడు. తన టీ20 కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీని (107 నాటౌట్) కేవలం కొద్ది బంతుల్లోనే పూర్తి చేసి పంజాబ్‌కు ఆశలు కల్పించాడు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలం కావడం, ముఖ్యంగా భారీ అంచనాలు ఉన్న మార్కస్ స్టోయినిస్ వంటి వారు త్వరగా ఔట్ అవ్వడం పంజాబ్ కొంపముంచింది. చివరకు పంజాబ్ 202 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది.

కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మ్యాజిక్..పంజాబ్‌కు పరాభవం
హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో తన నాయకత్వ పటిమను మరోసారి నిరూపించుకున్నాడు. బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన పిచ్‌పై కూడా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ. 4 ఓవర్లలో కేవలం 34 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో పంజాబ్ తన నంబర్ 1 స్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. యుజ్వేంద్ర చాహల్ వంటి మేటి బౌలర్లు ఉన్నా హైదరాబాద్ బ్యాటింగ్‌ను అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే కావ్య మారన్ ఆశించినట్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Story first published: Thursday, May 7, 2026, 12:18 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+