Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాటేరమ్మ కొడుకులు ఊచకోత!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ కింగ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. సొంత గడ్డపై తమ బ్యాటింగ్ పవర్‌ను మరోసారి చాటుకుంటూ ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది.

మెరుపు ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేయగా.. మరోవైపు ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు జోడించి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ పవర్‌ప్లేలో అందించిన వేగవంతమైన పునాదితో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

SRH vs PBKS Sunrisers Hyderabad Smash 235 4 Klaasen and Ishan Kishan Half-Centuries Punish Poor Punjab Fielding

కిషన్, క్లాసెన్ అర్ధసెంచరీల జోరు
మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన ఆటతీరుతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడగా.. క్లాసెన్ తనదైన శైలిలో 43 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరిద్దరి నిలకడైన బ్యాటింగ్ వల్ల హైదరాబాద్ భారీ స్కోరు సాధ్యమైంది. చివర్లో నితీశ్‌ రెడ్డి (13 బంతుల్లో 29*) మెరుపులు మెరిపించి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

పంజాబ్ పేలవ ఫీల్డింగ్
ప్రధాన ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ పంజాబ్ కింగ్స్ బౌలర్లను మరింత ఇబ్బంది పెట్టారు. నిజానికి వీరిద్దరూ తక్కువ పరుగులకే ఔట్ కావాల్సి ఉంది, కానీ పంజాబ్ ఫీల్డర్ల పేలవ ప్రదర్శన వారికి కలిసొచ్చింది. ఒత్తిడిలో పంజాబ్ ఫీల్డింగ్ పూర్తిగా విఫలమైంది. ఇషాన్ కిషన్, క్లాసెన్‌లకు సంబంధించి ఏకంగా మూడు క్యాచ్‌లను వదిలేయడమే కాకుండా ఓ స్టంపింగ్ అవకాశాన్ని కూడా పంజాబ్ చేజార్చుకుంది. ఈ వరుస తప్పిదాలతో లభించిన లైఫ్స్‌ను అందిపుచ్చుకున్న ఈ జోడీ స్కోరును భారీ స్థాయికి తీసుకెళ్లింది.

నిరాశ పరిచిన పంజాబ్ బౌలర్లు
హైదరాబాద్ బ్యాటర్ల దాడికి పంజాబ్ కింగ్స్ బౌలర్లు చేతులెత్తేశారు. మైదానం నలుమూలలా పరుగుల వర్షం కురుస్తుండటంతో వారిని కట్టడి చేయడం పంజాబ్ కెప్టెన్‌కు కష్టంగా మారింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పుడు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ బ్యాటర్లు ఎంతవరకు పోరాడతారో చూడాలి.

Story first published: Wednesday, May 6, 2026, 21:30 [IST]
Other articles published on May 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+