సన్‌రైజర్స్ జట్టులోకి స్టార్ క్రికెటర్ ఎంట్రీ: పంజాబ్‌కు కమిన్స్ వార్నింగ్!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న కీలక పోరులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో వరుస మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ.. తమ ఆటగాళ్లంతా వృత్తిపరంగా చాలా దృఢంగా ఉన్నారని, ఈ మ్యాచ్‌లో విజయంపై ధీమాగా ఉన్నామని శ్రేయస్ పేర్కొన్నాడు.
శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే?
టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ మాట్లాడుతూ.. "మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ మేము చాలా నేర్చుకున్నాం. ప్రయాణాల వల్ల అలసట ఉన్నా ఆటగాళ్లెవరూ ఫిర్యాదు చేయడం లేదు, అందరూ బాగానే ఉన్నారు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన తీరును చూశాక.. మేము ముందుగా బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని భావించాం. ఈ మ్యాచ్ కోసం జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు" అని వెల్లడించారు.

సన్‌రైజర్స్ సిద్ధం.. కమిన్స్ స్పందన
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "తాను కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు. ఈ సీజన్‌లో తమకు హోమ్ గ్రౌండ్‌లో ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉందని, ఈ రాత్రి కూడా మంచి ప్రదర్శన ఇస్తామని ఆశిస్తున్నట్లు చెప్పాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని, బోర్డుపై భారీ స్కోరు వేయడమే తమ లక్ష్యమని కమిన్స్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్ కోసం నితీష్ రెడ్డి జట్టులోకి తిరిగి రావడం తమకు కలిసొచ్చే అంశమని కమిన్స్ పేర్కొన్నాడు.
తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కాన్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications