న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌కు చుక్కలు చూపించిన ఆప్ఘన్: చివరివరకు ఉత్కంఠ, ఆఖరి ఓవర్‌లో విజయం

AFG

హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో ఆఖరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు పాకిస్థాన్‌ విజయం సాధించింది. సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్థాన్ ఒకానొక దశలో ఇబ్బంది పడింది.

అయితే, చివర్లో ఇమాద్ వసీమ్ (54 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ పోరాటం చేయడంతో పాక్ 3 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 230 పరుగులు చేసింది. ఈ విజయంతో 9 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరింది.

228 పరుగుల సాధారణ లక్ష్యఛేదనలో తొలి ఓవర్‌లోనే పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముజీబ్ బంతిని సరిగ్గా అంచనా వేయని ఓపెనర్ ఫకార్ జమాన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇమాముల్ హక్ (36; 4 ఫోర్లు)కు ఫామ్‌లో ఉన్న బాబర్ తోడవడంతో పాక్ స్కోరు బోర్డులో వేగం పెరిగింది.

రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాక.. నబీ వరుస ఓవర్లలో ఇమామ్, బాబర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత హఫీజ్ (19), సోహైల్ (57 బంతుల్లో 27) కూడా పెవిలియన్‌కు చేరారు. చివర్లో పాక్ విజయానికి 30 బంతుల్లో 46 పరుగులు కావాలి. ఆల్‌రౌండర్ ఇమాద్ తప్ప మరో స్పెషలిస్ట్ బ్సాట్స్‌మన్ లేడు.

ఈ దశలో ఆఫ్ఘన్ కెప్టెన్ గుల్బదీన్ నైబ్ 46వ ఓవర్ వేయడం పాక్‌కు వరంగా మారింది. వరుస బంతులను 4,2,2,4,4 కొట్టిన ఇమాద్ మొత్తం 18 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 24 బంతుల్లో 28కి చేరింది. తదుపరి ఓవర్‌లో రషీద్ ఖాన్ 10 పరుగలివ్వగా.. షాదాబ్ రనౌటయ్యాడు.

చివర్లో ఆఫ్ఘన్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో లక్ష్యం 12 బంతుల్లో 16కు వచ్చింది. ఈ దశలో రషీద్ బౌలింగ్ భారీ సిక్సర్ కొట్టిన వహాబ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పాక్‌ను విజయానికి చేరువ చేయగా.. చివరి ఓవర్ నాలుగో బంతికి ఇమాద్ ఫోర్ కొట్టి విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు.

పాకిస్థాన్ విజయ లక్ష్యం 228
అంతకముందు ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్లలో అస్ఘర్‌(42; 35బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), నజీబుల్లా(42; 54బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ(4/47), వాహబ్ రియాజ్(2/29), ఇమాద్ వసీం(2/48) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీలో ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన తొలి యువ క్రికెట‌ర్‌గా షాహీన్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆప్ఘనిస్థాన్‌కు సరైన ఆరంభం లభించలేదు. షాహిన్‌ అఫ్రిదీ 5వ ఓవర్‌లో వరుస బంతుల్లో గుల్బాదిన్‌(15), హస్మతుల్లా(0)లను వెను వెంటనే ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపు పోరాడినట్లే కనిపించిన రెహమత్‌(35) ఇమాద్‌ బౌలింగ్‌లో బాబర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

1
43679

దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో ఉన్న జట్టును అస్గర్ ఆదుకున్నాడు. పాక్‌ బౌలర్లు ధాటిగా ఎదుర్కొంటూ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, ఇన్నింగ్స్ 26 ఓవర్‌లో షెదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అస్ఘర్‌(42), తర్వాతి ఓవర్‌లోనే ఇక్రమ్‌(24) వరుసగా పెవిలియన్‌కు చేరడంతో స్కోరు వేగానికి అడ్డుకట్ట పడింది.

అనతంరం వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ అఫ్గాన్ ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బతీశారు. మహ్మద్ నబి(16) నిరాశ పరిచినా.. నజీబుల్లా మాత్రం కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే జోరు పెంచే సమయంలో 45 ఓవర్‌లో షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో నజీబ్‌(42) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఆప్ఘనిస్థాన్ త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది.

Story first published: Sunday, June 30, 2019, 8:09 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X