న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టిన ఫకార్ జమాన్-హక్ జోడీ

By Nageshwara Rao
Pakistans Fakhar Zaman, Imam-Ul-Haq Break All-Time Opening Partnership Record In ODIs

హైదరాబాద్: జింబాబ్వేలోని బులవాయా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో శుక్రవారం పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ (156 బంతుల్లో 210 నాటౌట్‌; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో సత్తా చాటగా, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ (122 బంతుల్లో 113; 8 ఫోర్లు) విజృంభించాడు.

దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌‌లు అత్యధిక భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా అరుదైన రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డేలో ఓపెనర్లు ఇద్దరూ కలిసి 304 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సరికొత్త రికార్డు నమోదు చేశారు.

2006లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో

2006లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో

దీంతో 2006లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య, ఉప్పల్ తరంగ పేరిట నమోదైన 286 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు. అంతేకాదు, వన్డేల్లో తొలిసారి డబుల్ సెంచరీ సాధించిన పాక్ క్రికెటర్ రికార్డును జమాన్ సొంతం చేసుకున్నాడు. 1997లో సయ్యద్ అన్వర్ సాధించిన 194 పరుగులు అత్యధిక పరుగుల రికార్డును ఫకార్ జమాన్ ఈ మ్యాచ్‌లో అధిగమించాడు.

పాక్ తరుపున ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం

పాక్ తరుపున ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం

అంతేకాదు పాకిస్థాన్ జట్టు తరుపున ఇప్పటివరకు నమోదైన అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సైతం ఈ జోడీ అధిగమించింది. 1994లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అమీర్ సొహైల్, ఇంజమాముల్ హక్ సాధించిన 263 పరుగుల భాగస్వామ్యాన్ని తాజా మ్యాచ్‌లో ఈ జోడీ అధిగమించింది. అంతేకాదు 2017లో పాక్‌తో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు సాధించిన అత్యధిక పరుగుల (284) భాగస్వామ్యం రికార్డు ఇప్పుడు మూడో స్థానానికి పరమితమైంది.

కెన్యాతో జరిగిన వన్డేలో సచిన్-గంగూలీ సైతం

కెన్యాతో జరిగిన వన్డేలో సచిన్-గంగూలీ సైతం

మరోవైపు భారత్‌కు తరుపున అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సచిన్-గంగూలీలు ఉన్నారు. 2001లో కెన్యాతో జరిగిన వన్డేలో ఈ జోడీ 258 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. కాగా, శుక్రవారం జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డేలో పాక్‌ 244 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది.

పాకిస్తాన్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం

పాకిస్తాన్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం

ఫకార్ జమాన్ (210 నాటౌట్), ఇమామ్ ఉల్ హక్‌ (113) రాణించగా... చివర్లో ఆసిఫ్‌ అలీ (22 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పాక్‌ 50 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 42.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. పరుగుల పరంగా పాకిస్తాన్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం.

Story first published: Saturday, July 21, 2018, 13:52 [IST]
Other articles published on Jul 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X