న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్ జెర్సీలపై షాహిద్‌ అఫ్రిదీ ఫౌండేషన్‌ లోగో!!

Pakistan players to sport Shahid Afridi Foundation logo on their jerseys

కరాచీ: కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై భారీగానే పడింది. క్రీడలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. స్పాన్సర్‌షిప్‌ అందించే విషయంలో పలు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టుకు అండగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సుదీర్ఘ కాలంగా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న 'పెప్సీ' ఇటీవలే తప్పుకుంది. దీంతో సరైన స్పాన్సర్లు లేక పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సతమతమవుతోంది.

స్పాన్సర్‌ స్థానంలో స్వచ్ఛంద సంస్థ

స్పాన్సర్‌ స్థానంలో స్వచ్ఛంద సంస్థ

పాకిస్తాన్ జట్టు స్పాన్సర్‌ లేకుండానే ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అయితే పాక్ ఆటగాళ్లు ఇంగ్లండ్‌ పర్యటనలో తమ జెర్సీలపై మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిదీకి చెందిన ఛారిటీ ఫౌండేషన్ (షాహిద్‌ అఫ్రిదీ ఫౌండేషన్)‌ లోగోను ధరించనున్నారు. కరోనా నుంచి కోలుకున్న అఫ్రిదీ తాజాగా ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించాడు.

అఫ్రిది ఫౌండేషన్‌ లోగోతో పాక్‌ క్రికెటర్లు

అఫ్రిది ఫౌండేషన్‌ లోగోతో పాక్‌ క్రికెటర్లు

కరోనా వైరస్ సమయంలో 'షాహిద్‌ అఫ్రిదీ ఫౌండేషన్'‌ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించింది. తనను పాక్‌ బోర్డు ఇలా గౌరవించడం పట్ల షాహిద్‌ అఫ్రిదీ ఆనందం వ్యక్తం చేశాడు. 'ఇంగ్లండ్‌ టూర్‌లో పాక్ క్రికెటర్ల కిట్లపై మా ఫౌండేషన్‌ లోగో ఉంటుంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. పీసీబీకి మేము ఛారిటీ భాగస్వాములు అయినందున ఈ అవకాశం దక్కింది. పీసీబీతో సహా, సీఈవో వసీం ఖాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంగ్లండ్ పర్యటనలో పాక్‌ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నాడు.

ఓ కార్పొరేట్‌ సంస్థ సిద్ధం

ఓ కార్పొరేట్‌ సంస్థ సిద్ధం

తమతో స్పాన్సర్‌షిప్‌ చేసుకొనేందుకు ఓ కార్పొరేట్‌ సంస్థ సిద్ధంగా ఉందని, ఆ విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఓ పీసీబీ అధికారి తాజాగా వెల్లడించారు. తాము అనుకున్న దాని కన్నా చాలా తక్కువ మొత్తం చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చిందని, అది కూడా ఇదివరకు చెల్లించిన మొత్తంలో 40 శాతమేనని, అందుకే తాము ఆలోచిస్తున్నామని ఆ అధికారి వెల్లడించాడు.

ఆగస్టు 5 నుంచి సిరీస్

ఆగస్టు 5 నుంచి సిరీస్

ఇంగ్లండ్ సిరీస్ ముందు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దాదాపు 10 మంది పాకిస్తాన్ ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో వారికి పలుమార్లు వైరస్ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలిన వారిని ఇంగ్లండ్‌కు పంపించలేదు. నెగిటివ్‌గా తేలిన ఆటగాళ్లను మాత్రమే అక్కడికి పంపించారు. బయో సెక్యూర్‌ విధానంలో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్లు ఆగస్టు 5 నుంచి 25 వరకు మూడు టెస్టులు, ఆ వెంటనే 28 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు మూడు టీ20లు తలపడనున్నాయి.

బర్త్‌ డే గిఫ్ట్.. సునీల్‌ గవాస్కర్‌కు రెండు శాశ్వత సీట్లు!!

Story first published: Friday, July 10, 2020, 11:33 [IST]
Other articles published on Jul 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X