న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌ క్రికెటర్ల మంచి మనసు.. కరోనా కోసం భారీ విరాళం!!

Pakistan cricketers to donate Rs 5 million to government emergency fund to fight Coronavirus

కరాచీ: ప్రమాదకర కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ, భారత రెస్లర్ బజరంగ్ పూనియా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీలు విరాళాలు ప్రకటించారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్లు కూడా చేరారు.

నేను చేస్తుందే మీరూ చేయండి.. ప్రజలకు సచిన్ విజ్ఞప్తి!!నేను చేస్తుందే మీరూ చేయండి.. ప్రజలకు సచిన్ విజ్ఞప్తి!!

 5 మిలియన్‌లు విరాళం:

5 మిలియన్‌లు విరాళం:

కరోనా బాధితులను ఆదుకునేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఆ దేశ ప్రభుత్వానికి రూ. 5 మిలియన్‌లు విరాళంగా ఇచ్చింది. జాతీయ అత్యవసర నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ ఎసాన్‌ మణి ప్రకటించారు. కరోనాపై పోరాటానికి సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్లు రూ. 5 మిలియన్‌లు విరాళం ఇచ్చారని ఆయన తెలిపారు. బోర్డులోని కిందిస్థాయి నుంచి సీనియర్‌ మేనేజర్‌ వరకు ఉన్న ఉద్యోగులు అంతా తమ ఒక్క రోజు జీతాన్ని జాతీయ అత్యవసర నిధికి అందజేయనున్నట్టు మణి వెల్లడించారు. ఇక జనరల్‌ మేనేజర్‌ ఆపై స్థాయి అధికారులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చెప్పారు.

ప్రభుత్వానికి అండగా ఉండాలి:

ప్రభుత్వానికి అండగా ఉండాలి:

పీసీబీ ఎప్పుడూ కష్ట సమయాల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని పీసీబీ చైర్మన్‌ మణి గుర్తుచేశారు. కరోనా వైరస్‌ క్రికెట్‌కు అంతరాయం కలిగించవచ్చు కానీ.. దేశం మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అవసరమైన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రజలు అందరు కూడా కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పాకిస్తాన్‌లో కూడా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. పాక్‌లో ఇప్పటివరకు 1,000కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

బంగ్లా క్రికెటర్ల సగం రోజు వేతనం:

బంగ్లా క్రికెటర్ల సగం రోజు వేతనం:

కరోనాపై పోరాటంలో ఆర్థికపరంగా తమ వంతు చేయూతనందించేందుకు వివిధ దేశాల క్రికెటర్లు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌ సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన 27 మంది క్రికెటర్లు తమ సగం రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం సుమారు 25 లక్షల టాకాలు. అంటే సుమారు రూ. 23 లక్షలకు సమానం.

 లంక బోర్డు కూడా:

లంక బోర్డు కూడా:

శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా తమ తరఫు నుంచి 2 కోట్ల 50 లక్షల శ్రీలంక రూపాయలు (సుమారు 1 కోటి 2 లక్షలు) ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంబంధించి చికిత్సలో కీలకమైన వీడియో లారింగోస్కోప్‌ తదితర వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు కావాల్సిన మొత్తాన్ని అందజేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అందరూ ఇస్తున్నా.. మన టీమిండియా ఆటగాళ్లు మాత్రం ఇప్పటి వరకు ఎవరూ విరాళాలు ప్రకటించలేదు.

Story first published: Thursday, March 26, 2020, 13:30 [IST]
Other articles published on Mar 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X