
బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
తనకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాక్ మీడియా కథనం ప్రకారం... తనకు క్షమాపణలు చెప్పేవరకు ఆయనతో కలిసి ఎటువంటి సమావేశంలోనూ పాల్గొనబోనని మిక్కీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో తదుపరి జరగనున్న పరిణామాల పట్ల ఆసక్తి నెలకొంది.

తెలివిలేనివాడు.. గాడిద:
పాక్ క్రికెట్ కమిటీలో మాజీ క్రికెటర్లు వసీమ్ అక్బర్, మిస్భా ఉల్ హక్, ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఉరూజ్ ముంతాజ్‌తో పాటు మోహ్సిన్ ఖాన్ ఉన్నారు. కీలక పదవిలో ఉన్న ఆయన ఇటీవల ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిక్కీ ఆర్థర్‌ను ‘తెలివిలేనివాడు, గాడిద' అని పేర్కొన్నారు. పాక్ క్రికెట్ జట్టును ఎంపిక చేసే విషయంలో ఉన్న విభేదాల కారణంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంజమామ్ ఉల్ హక్‌తో కూడా విభేదాలు
దాంతో కోపం మిక్కీ తెచ్చుకున్నారు. ఆయన వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ ముగిసే వరకు పాక్‌కు ప్రధాన కోచ్‌గా ఉండనున్నారు. మిక్కీకి మోహ్సిన్‌తో మాత్రమే కాకుండా పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్‌తో కూడా విభేదాలు ఉన్నాయి. జట్టు ఎంపిక విషయంలో వీరిద్దరి మధ్య వివాదం పెరిగింది.

హఫీజ్‌ను కోచ్ ఆర్థర్ ఎంపిక చేయకపోవడం
మొహమ్మద్ హఫీజ్ కూడా ఎంపిక చేసిన పాక్ జట్టులో ఒకరు. కాగా, హఫీజ్‌ను కోచ్ ఆర్థర్ ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతని ఎంపిక పూర్తిగా ఇంజమామ్ ఉల్ హక్ వల్లే జరిగింది. కాగా, మే 6, 2016న మిక్కీ పాక్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యారు. ఈ విదేశీ కోచ్ పట్ల పాక్ జాతీయ జట్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications
