న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు: అఫ్రిది ట్వీట్‌కు సచిన్ గట్టి కౌంటర్

No Outsider Needs To Tell Us: Sachin Tendulkar On Shahid Afridis Kashmir Tweet

హైదరాబాద్: షాహిద్ చేసిన ట్వీట్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ విషయంలో ట్విట్టర్ ద్వారా భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై బుధవారం గంగూలీ పుస్తకావిష్కరణకు వచ్చిన సచిన్ ప్రతిఘటించాడు.

బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. 'మన దేశాన్ని నడిపించే సమర్థవంతమైన వ్యక్తులు మనకు ఉన్నారు. బయట వ్యక్తులు మనకు చెప్పడమేంటి. మేం ఏం చేయాలో బయట వ్యక్తులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు' అని సచిన్‌ మండిపడ్డారు.

ధీటుగా బదులిచ్చిన మనోళ్లు:

ధీటుగా బదులిచ్చిన మనోళ్లు:

దీంతో మన క్రికెటర్లు అఫ్రిదిపై ఎదురుదాడికి దిగారు. కపిల్‌దేవ్‌, సురేశ్‌ రైనా, విరాట్‌ కోహ్లి, జడేజా, గౌతం గంభీర్‌ తదితరులు ఇప్పటికే ఆఫ్రిదిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గంభీర్

గంభీర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అసలు అఫ్రిదికి యూఎన్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించాడు. అఫ్రిది డిక్షనరీ ప్రకారం యూఎన్ అంటే అండర్ నైన్టీన్ అని, అదే అతడి మానసిక పరిపక్వత అని మండిపడ్డాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ

తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అఫ్రిది ట్వీట్‌పై స్పందించారు. ‘ఒక భారతీయుడిగా నా దేశానికి ఏది ఉత్తమమైనదో దాన్నే వ్యక్తపరచాలి. నా ఆలోచనలు ఎప్పుడూ దేశ ప్రయోజనం కోసమే ఉంటాయి. దేశానికి వ్యతిరేకంగా ఉన్న వాటికి నేను ఎన్నటికీ మద్దతు ఇవ్వబోను. నా మొదటి ప్రాధాన్యత దేశానికే ఇస్తాను' అని కోహ్లీ పేర్కొన్నాడు.

మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా

ఓ మీడియా సమావేశలంలో పాల్గొన్న కపిల్‌దేవ్ మాట్లాడుతూ.. ‘అసలు అతను ఎవరు? అతనికి మనం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి? ఇటువంటి వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు' అని కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు అఫ్రీది ఎందుకిలా:

కశ్మీర్‌లో 12 మంది ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ విషయంపై అఫ్రిది ట్వీట్‌ ద్వారా స్పందించాడు. ఆ ట్వీట్‌లో కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని, వారిపై తీవ్రంగా అణచివేత కొనసాగుతోందంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. యూఎన్‌, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశాడు.

ధావన్ కూడా

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చాలా ఘాటుగా స్పందించాడు. ముందు నీ దేశం పరిస్థితిని చక్కదిద్దుకో. నీ ఆలోచన నీ దగ్గరే పెట్టుకో. మా దేశం కోసం మేం బాగానే చేస్తున్నాం. భవిష్యత్తులోనూ ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మా గురించి ఎక్కువగా ఆలోచించకు అంటూ అఫ్రిదికి దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు.

Story first published: Thursday, April 5, 2018, 17:56 [IST]
Other articles published on Apr 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X