న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్‌లో ఉగ్రదాడి: మెక్‌కల్లమ్ నుంచి రోహిత్ వరకు ఎవరేమన్నారు?

New Zealand terror attack: From Brendon McCullum to Virat Kohli, cricketers condemn Christchurch Mosque shooting

హైదరాబాద్: న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది మృతి చెందగా... మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది.

<strong>42ఏళ్ల వయసులో పేస్ అలా, నేను ఎంతో కొంత క్రికెట్‌ ఆడలేనా?: శ్రీశాంత్</strong>42ఏళ్ల వయసులో పేస్ అలా, నేను ఎంతో కొంత క్రికెట్‌ ఆడలేనా?: శ్రీశాంత్

ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంట‌న్ అనే వ్య‌క్తిని న్యూజిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెమీ ఆటోమెటిక్ వెప‌న్‌తో డీన్స్ ఏవ్‌ మ‌సీదులోకి వ‌చ్చిన అత‌ను విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. అంతేకాదు ఈ కాల్పుల ఘటన అచ్చం పజ్బీ గేమ్‌ను పోలి ఉంది. ఎందుకంటే కాల్పుల ఘటనను లైవ్‌లో చిత్రీకరించాడు.

ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు కూడా మసీదులో ప్రార్థన చేసుకోవడానికి వెళ్లారు. దీంతో బంగ్లా క్రికెటర్లు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఐసీసీతో పాటు ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి.

ఉగ్రగాడి నేపథ్యంలో న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన మూడో టెస్టు రద్దు అయింది. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా క్షేమంగా ఉన్నారని ట్విట్టర్‌‌లో అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్ చ‌రిత్ర‌లో ఇది చీక‌టి రోజు అని ప్ర‌ధాని జెసిండె ఆర్డెన్ తెలిపారు. న్యూజిలాండ్ జాతీయ జెండాను పార్ల‌మెంట్ వ‌ద్ద అవ‌న‌తం చేశారు.

Story first published: Friday, March 15, 2019, 17:42 [IST]
Other articles published on Mar 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X