న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాన్షి లీగ్‌లో వింత బౌలింగ్: రెండు చేతులతో బౌలింగ్, సఫారీ సవ్యసాచి ఇతడే! (వీడియో)

Mzansi Super League: Gregory Mahlokwana Takes Wickets Bowling With Both Arms in MSL 2019

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరంభం నుంచీ క్రికెట్‌ను పరిశీలిస్తే కాలానికి అనుగుణంగా చోటు చేసుకున్న ఈ మార్పులకు దారితీసిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా టీ20 క్రికెట్ రాకతో బౌలింగ్, బ్యాటింగ్ శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇంతకముందు ఎవరూ ఊహించని, ధైర్యం చేయిని షాట్లను బ్యాట్స్ మెన్ ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. అలాగే, బౌలర్లు గతంతో పోలిస్తే కష్టతరమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మాన్షి సూపర్ లీగ్‌లో ఓ బౌలర్ సవ్యసాచి తరహా తన రెండు చేతులతో సమర్థవంతంగా బౌలింగ్ చేస్తున్నాడు.

<strong>ఢిల్లీ పగ్గాలు శ్రేయాస్ అయ్యర్‌కే: ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేసిన యాజమాన్యం</strong>ఢిల్లీ పగ్గాలు శ్రేయాస్ అయ్యర్‌కే: ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేసిన యాజమాన్యం

రెండు చేతులతో బౌలింగ్

రెండు చేతులతో బౌలింగ్

అతడి పేరు గ్రెగొరీ మహ్లోక్వానా. రెండు చేతులతో బౌలింగ్ చేయడమే కాదు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అతడు వెలుగులోకి వచ్చాడు. మాన్షి సూపర్ లీగ్‌లో గ్రెగొరీ మహ్లోక్వానా కేప్ టౌన్ బ్లిడ్జ్ జట్టు తరుపున ఆడుతున్నాడు.

తొలి వికెట్‌గా సరేల్ ఇర్వీని ఔట్ చేసిన గ్రెగొరీ

టోర్నీలో భాగంగా సోమవారం కేప్ టౌన్ బ్లిడ్జ్-డర్బన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గ్రెగొరీ మహ్లోక్వానా రెండు చేతులతో వికెట్లు తీసి క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్యర్యాలకు గురి చేశాడు. తొలుత కుడిచేతి బౌలింగ్‌తో డర్బన్ హీట్ ఆటగాడు సరేల్ ఇర్వీని పెవిలియన్‌కు చేర్చాడు.

ఎడమచేతి బౌలింగ్‌లో రెండో వికెట్

ఎడమచేతి బౌలింగ్‌లో రెండో వికెట్

ఆ తర్వాతి ఓవర్‌ను ఎడమచేతితో బౌలింగ్ చేసిన గ్రెగొరీ మహ్లోక్వానా డర్బన్ హీట్ కెప్టెన్ డేన్ విల్లాస్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. మహ్లోక్వానా బౌలింగ్‌లో ముందుకొచ్చే ఆడే క్రమంలో డేన్ విల్లాస్‌(8) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన మహ్లోక్వానా 2/26తో చెలరేగాడు.

రెండు వికెట్లు తీసిన గ్రెగొరీ

కేప్ టౌన్ బ్లిడ్జ్ బౌలర్లలో మహ్లోక్వానాతో పాటు డేల్ స్టెయిన్ మూడు వికెట్లు తీయగా... వాహబ్ రియాజ్, సిసందా మంగల చెరో వికెట్ తీశారు. క్వింటన్ డీకాక్ నాయకత్వంలోని కేప్ టౌన్ బ్లిడ్జ్ జట్టు ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి జట్టుకు నిర్దేశించన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుంది.

Story first published: Tuesday, November 19, 2019, 13:14 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X