న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నవంబర్ వరకు ధోని సెలక్షన్‌కు అందుబాటులో ఉండకపోవడానికి కారణమిదే!

MS Dhoni : Here Is The Reason Why Dhoni Is Unavailable For T20Is || Oneindia Telugu
MS Dhoni unavailable for selection due to injury sustained during World Cup: Report


హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో చివరిసారిగా ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని తనంతట తానుగా రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

ఇందులో భాగంగా వెస్టిండిస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరమయ్యాడు. అయితే, తాజాగా స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. గాయం కారణంగా ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి వెన్నునొప్పితోనే ధోని వరల్డ్‌కప్‌కు వెళ్లాడు.

ఏకగ్రీవంగా ఎన్నిక.. టీఎన్‌సీఏ అధ్యక్షురాలిగా రూప గురునాథ్‌.. తొలి మహిళగా రికార్డుఏకగ్రీవంగా ఎన్నిక.. టీఎన్‌సీఏ అధ్యక్షురాలిగా రూప గురునాథ్‌.. తొలి మహిళగా రికార్డు

నొప్పి తీవ్రతరం అవడంతో

నొప్పి తీవ్రతరం అవడంతో

అయితే, టోర్నీ సమయంలో ఆ నొప్పి తీవ్రతరం అవడంతో పాటు నాకౌట్ మ్యాచ్‌లో ధోని చేతికి మణికట్టుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం నుంచి కోలుకుని నవంబర్ నాటికి ధోని ఫిట్ అవుతాడని భావిస్తున్నారు. ఈ కారణం చేతనే ధోని నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని చెప్పినట్లు తెలుస్తోంది.

38 ఏళ్ల ధోని ఫిజికల్‌గా ఫిట్‌

38 ఏళ్ల ధోని ఫిజికల్‌గా ఫిట్‌

38 ఏళ్ల ధోని ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పటికీ వెన్నునొప్పి మాత్రం అతడిని గత కొంతకాలంగా బాధిస్తోంది. ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఫిజియోతో ధోని సపర్యలు కూడా చేయించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ధోని పంజాబ్‌పై 79 పరుగులతో చెలరేగాడు.

ప్రపంచకప్ 2019 చివరిదని అనుకున్నారు

ప్రపంచకప్ 2019 చివరిదని అనుకున్నారు

నిజానికి ప్రపంచకప్ 2019 ధోనీ చివరిది అని అనుకున్నారు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన మ్యాచే ధోనీకి చివరిది అని ప్రచారం సాగింది. కానీ.. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి రెండు నెలల విరామం తీసుకుని భారత ఆర్మీలో సేవలందించాడు. విధుల్లో భాగంగా 106 టెరిటోరియల్ ఆర్మీ (పారా బెటాలియన్)లో సేవ చేయడానికి 15 రోజులు కాశ్మీర్‌లో గడిపాడు.

కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు

కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు

అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్ళాడు. ధోనీ సెలక్షన్‌ కమిటీకి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ వార్తతో ధోనీ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఏదేమైనా ఐపీఎల్-13లో జట్టు చెన్నైకి ధోనీ సారధ్య భాద్యతలు నిర్వహిస్తాడని స్పష్టం అయింది.

Story first published: Thursday, September 26, 2019, 15:06 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X