న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ గైర్హాజరీ పంత్‌కు గొప్ప అవకాశం: తొలి టీ20కి ముందు కోహ్లీ

IND V WI Series 2019,Ist T20I:MS Dhoni's Absence Great Opportunity For Rishabh Pant Says Virat Kohli
MS Dhonis absence great opportunity for Rishabh Pant to become a consistent performer: Virat Kohli

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటన నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకోవడం... యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ తనలోని నైపుణ్యాన్ని బయటపెట్టడానికి ఇదొక చక్కటి అవకాశమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ తర్వాత మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉన్న టీమిండియా మళ్లీ సమరానికి సిద్ధమైంది.

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా తొలి టీ20కి సన్నద్ధమైంది. తొలి టీ20 నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ మాట్లాడుతూ ధోని అనుభవం ఎల్లప్పుడూ జట్టుకి ఎంతో కీలకమని అన్నాడు.

జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)

పంత్‌ ఒక నైపుణ్యమున్న ఆటగాడు

"ఇక, రిషభ్‌ పంత్‌ ఒక నైపుణ్యమున్న ఆటగాడు. విండీస్‌ పర్యటనలో అతను సత్తాచాటడానికి ఇదొక మంచి తరుణం. విండీస్‌ పర్యటన నుంచి ధోని తప్పుకోవడంతో పంత్‌ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పంత్‌ ప్రతిభ గురించి ప్రత్యేకం చెప్పక్కర్లేదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడతాడనే టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది" అని కోహ్లీ అన్నాడు.

విండీస్‌ పర్యటనను పంత్‌ ఉపయోగించుకోవాలి

"నిలకడైన ఆటతో విండీస్‌ పర్యటనను పంత్‌ ఉపయోగించుకోవాలనే మేము కోరుతున్నాం. ధోని అనుభవం అనేది మాకు ఎప్పుడూ కీలకమే. ఇక హార్దిక్‌ పాండ్యా కూడా విశ్రాంతి తీసుకోవడంతో ఇది యువ క్రికెటర్లకు మంచి అవకాశం. వారి అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారనే ఆశిస్తున్నా" అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

నీ గైర్హాజరీతో మూడు ఫార్మాట్‌లకు వికెట్ కీపర్‌గా పంత్

నీ గైర్హాజరీతో మూడు ఫార్మాట్‌లకు వికెట్ కీపర్‌గా పంత్

ధోనీ గైర్హాజరీతో మూడు ఫార్మాట్‌లకు ఎంపికైన యువ కెరటం రిషబ్ పంత్‌పై అదనపు బాధ్యతలు పడనున్నాయి. విండిస్ పర్యటన మొత్తానికి తొలి ప్రాధాన్య కీపర్‌గా ఎంపికైన పంత్ మరి ఏమేరకు రాణిస్తాడో? చూడాలి మరి. మరోవైపు బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి నవదీప్ సైనీ, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్‌లో ఎవరు చాన్స్ దక్కించుకుంటారో చూడాలి.

రాహుల్ చాహర్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం

ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యాలలో జడేజాకే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక, చైనామన్ స్పిన్నర్లు గైర్హాజరీలో రాహుల్ చాహర్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు ఆతిథ్యమిస్తోన్న లాడర్‌హిల్‌ మైదాన పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం.

2016లో ఇదే స్టేడియంలో టీమిండియా ఓటమి

ఇంతకుముందు వెస్టిండిస్‌తో ఇక్కడ జరిగిన టీ20లో వెస్టిండీస్‌ ఏకంగా 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (110) మెరుపు సెంచరీ సాయంతో భారత్‌ లక్ష్యానికి చేరువగా వచ్చింది కానీ.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.

Story first published: Saturday, August 3, 2019, 19:11 [IST]
Other articles published on Aug 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X