మిచెల్ జాన్సన్ తలకు గాయం: 16 కుట్లు, ఐపీఎల్‌కు అనుమానమే!

Posted By:
Mitchell Johnson Suffers Horrific Injury, Uploads Pictures On Instagram

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. 36 ఏళ్ల మిచెల్ జాన్సన్ తలకు బలమైన గాయం కావడంతో 16 కుట్లు పడ్డాయి. చిన్‌-అప్‌ బార్‌ వ్యాయామం చేస్తుండగా పైకడ్డీకి జాన్సన్‌ తల బలంగా తగిలింది.

దీంతో జాన్సన్ తల పైభాగాన సుమారు రెండు అంగుళాల వెడల్పుగా కట్‌ అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోని జాన్సన్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 11వ సీజన్‌లో మిచెల్ జాన్సన్ ఆడేది అనుమానంగా మారింది.

ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో మిచెల్ జాన్సన్‌ను రూ. 2 కోట్లకు కోల్‌కతా ఖరీదు చేసిన సంగతి తెలిసిందే. గత సీజనల్లో జాన్సన్ ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. ఆస్ట్రేలియా తరుపున 73 టెస్టు మ్యాచ్‌లాడిన జాన్సన్ 313 వికెట్లు తీశాడు.

టెస్టుల్లో 12 సార్లు ఐదు వికెట్లను, మూడు సార్లు 10 వికెట్లను తీశాడు. ఇక, 153 వన్డేల్లో 239 వికెట్లు తీశాడు. మూడుసార్లు ఐదు వికెట్లను తీశాడు. 2007లో శ్రీలంకపై టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2015లో తన చివరి టెస్టుని న్యూజిలాండ్‌పై ఆడాడు. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ షాకర్స్ తరుపున ఆడుతున్నాడు.

Story first published: Tuesday, March 13, 2018, 11:16 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి