ఐపీఎల్: పేలవ ప్రదర్శన, అనుష్క పుట్టినరోజు నిరాశ పర్చిన కోహ్లీ

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్, మ్యాచ్ 38: టాస్ నెగ్గిన కోహ్లీ, ముంబైపై బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో బెంగళూరు అభిమానులను విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ రూపంలో బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ స్వప్ప స్కోరుకే వెనుదిరిగాడు. కర్మ్ శర్మ వేసిన 6వ ఓవర్ మొదటి బంతికి విరాట్ కోహ్లీ... రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. అనుకోని విధంగా త్వరగా అవుట్ కావడంతో కోహ్లీ విస్మయానికి గురయ్యాడు. నిరాశగా తల ఊపుతూ మైదానం వీడాడు. కాగా, సోమవారం తన ప్రేయసి అనుష్క శర్మ పుట్టినరోజు.

MI vs RCB: On Anushka Sharma’s birthday, why Virat Kohli needs all good wishes

ఈ నేపథ్యంలో ముంబైపై భారీ స్కోరు చేసి ఆమె పుట్టినరోజు నాడు బహుమతిగా ఇస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అంతకముందు కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ మన్‌దీప్‌ (13 బంతుల్లో 17; 3 ఫోర్లు) జట్టు స్కోరు 31 వద్ద హార్దిక్‌పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

మరోవైపు బెంగళూరు ఆటగాళ్లు పెవీలియన్‌కు క్యూ కట్టారు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోన్న బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోతోంది. 11వ ఓవర్ మూడో బంతికి క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (12) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అనంతరం 13వ ఓవర్ రెండో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ క్యాచ్ ఇచ్చి పెవివియన్‌కు చేరాడు. 27 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో 14వ ఓవర్ నాలుగో బంతికి షేన్ వాట్సన్(3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Story first published: Monday, May 1, 2017, 17:24 [IST]
Other articles published on May 1, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి