న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LPL 2020: నవీన్‌ను తిట్టలేదు.. సూచన మాత్రమే ఇచ్చా: అఫ్రిది

LPL 2020: Shahid Afridi says I gave only advise to Naveen-ul-Haq

కొలంబొ: లంక ప్రీమియర్‌ లీగ్‌ 2020లో భాగంగా గత రాత్రి జరిగిన గాలె గ్లాడియేటర్స్‌, కాండీ టస్కర్స్‌ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గాలే జట్టు కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది.. అఫ్గానిస్థాన్‌ యువ పేసర్‌‌ నవీన్‌ హుల్‌ హక్‌ను బహిరంగంగా దూషించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై ఆఫ్రిది మంగళవారం ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. నవీన్‌ను తిట్టలేదని, సూచన మాత్రమే ఇచ్చానని ఆఫ్రిది స్పష్టం చేశాడు.

'నేను నవీన్‌ హుల్‌ హుల్‌ హక్‌ను తిట్టలేదు. షేక్‌ హ్యాండ్‌ సందర్భంగా నవీన్‌ దగ్గరికి వచ్చినప్పుడు సీరియస్‌ అయిన మాట వాస్తవమే. మ్యాచ్‌లో ఉన్నంతసేపు ఆటపైనే దృష్టి పెట్టాలి తప్ప అనవసరంగా ఇతర ఆటగాళ్లపై నోరు పారేసుకోకూడదని సూచనలు మాత్రమే ఇచ్చాను. అంతేగాని అతనిపై ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు. నాకు అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. మనం ఒక జట్టులో ఉన్నామంటే.. సహచరులతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా గౌరవించడమనేది ఆటలో ప్రాథమిక ధర్మం' అని షాహిద్‌ ఆఫ్రిది ట్వీట్ చేశాడు.

ఏంజరిగిందంటే.. గాలె ఇన్నింగ్స్‌ చివర్లో మహ్మద్‌ అమిర్ ‌(15) బ్యాటింగ్‌ చేస్తుండగా.. తొలుత నవీన్‌ నోటికి పనిచెప్పాడు. 18వ ఓవర్‌ వేసిన నవీన్‌ మూడో బంతికి గుణతిలకను ఔట్‌ చేయగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన అమిర్‌ నాలుగో బంతిని బౌండరీకి బాదాడు. దీంతో నవీన్‌ ఏదో మాట అన్నాడు. అనంతరం నవీన్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేయడానికి మరోసారి బంతి అందుకోవడంతో.. అమిర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో మరోసారి నవీన్‌‌ తన నోటికి పనిచెప్పాడు.

ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవ్వడంతో మైదానంలోని ఇతరులు కలుగజేసుకొని వారిని అడ్డుకున్నారు. ఇక మ్యాచ్‌ పూర్తయ్యాక అమిర్‌ సైతం ఏదో అన్నాడు. చివరికి గాలే జట్టు ఓడిపోయాక ఆటగాళ్లతో కలిసి షాహిద్‌ అఫ్రిది మైదానంలోకి వస్తూ నవ్వుకుంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అదే సమయంలో నవీన్‌ కనపడడంతో.. అసలు ఏమైందని అడిగాడు. దాంతో అఫ్గాన్‌ పేసర్‌ మరోసారి మాటల యుద్ధానికి దిగాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దానిపై అఫ్రిది వివరణ ఇచ్చాడు.

క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ గురి.. పరువు నిలబెట్టుకోవాలని భారత్.. తుది జట్టులో మార్పులివే!!క్లీన్‌స్వీప్‌పై ఆసీస్ గురి.. పరువు నిలబెట్టుకోవాలని భారత్.. తుది జట్టులో మార్పులివే!!

Story first published: Tuesday, December 1, 2020, 21:34 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X