న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సియట్ క్రికెట్ అవార్డులు: కోహ్లీ, రోహిత్, బుమ్రా... ఎవరికి ఏ అవార్డు!

Lifetime achievement Award for Amarnath; Kohli, Rohit, Pujara, Bumrah & Smriti Mandhana win Big Awards

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్‌కు లైఫ్‌టైమ్ అవీచ్‌మెంట్ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికి గాను సోమవారం జరిగిన సియట్ అంతర్జాతీయ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో ఆయన్ని ఈ అవార్డుతో సత్కరించారు. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మొహిందర్ అమర్నాథ్‌ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

స్పెషల్ స్టోరీలు: ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019

మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఈ అవార్డు రావడం కోహ్లీకి కాస్త ఉత్సాహానిస్తుంది.

క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా కోహ్లీ

క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా కోహ్లీ

కాగా, 2018లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్లేయర్‌గా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ పురుషుల టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక, స్మృతి మంధానకు అంతర్జాతీయ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.

సూపర్ ఫామ్‌లో స్మృతి మంధాన

మంధాన విషయానికి వస్తే ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2018లో మంధాన 12 వన్డేలాడి 66.90 యావరేజితో 669 పరుగులు చేసింది. 25 టీ20లాడి 130.67 యావరేజితో 622 పరుగులు నమోదు చేసింది.

హాజరైన రోహిత్ శర్మ

ఈ కార్యక్రమానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అజ్యింకె రహానే, జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన, మాజీ క్రికెటర్లు మొహిందర్ అమర్నాథ్, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్‌లతో పాటు శుభమాన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, కుల్దీప్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

సియట్ అంతర్జాతీయ క్రికెట్ అవార్డులు:

లైఫ్‌టైమ్ అవీచ్‌మెంట్ అవార్డు - Mohinder Amarnath

అంతర్జాతీయ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ - Virat Kohli

అంతర్జాతీయ్ బౌలర్ ఆఫ్ ద ఇయర్ - Jasprit Bumrah

అంతర్జాతీయ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Cheteshwar Pujara

అంతర్జాతీయ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Rohit Sharma

అంతర్జాతీయ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ - Aaron Finch

అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడు - Kuldeep Yadav

అంతర్జాతీయ టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ - Rashid Khan

డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ - Ashutosh Aman

అంతర్జాతీయ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Smriti Mandhana

జూనియర్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - Yashasvi Jaiswal

క్రికెట్ జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ - Sriram Veera and Snehal Pradhan

స్పెషల్ ట్రిబ్యూట్: Late Ajit Wadekar

Story first published: Tuesday, May 14, 2019, 13:18 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X