న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో 400 నాటౌట్: తన రికార్డుని బద్దలు కొట్టే ఆ ఇద్దరి భారత ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన లారా

Brian Lara reveals which TWO Indian cricketers can break his long-standing 400 not out record in Test cricket

హైదరాబాద్: ఇటీవలే అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌లో 400 నాటౌట్‌గా నిలిచిన తన రికార్డును బద్దలు కొట్టకపోవడం విచారకరమని లెజెండరీ వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా వెల్లడించారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెండో రోజు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి ముందు డేవిడ్ వార్నర్ 335 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ యొక్క అత్యధిక టెస్టు స్కోరు 334 పరుగులను మాత్రం అధిగమించాడు.

Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట (వీడియో)Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట (వీడియో)

లారా స్కోరు వద్దకు వెళ్లలేకపోయిన వార్నర్

లారా స్కోరు వద్దకు వెళ్లలేకపోయిన వార్నర్

అయితే, లారా స్కోరు దగ్గరకు మాత్రం వెళ్ళలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా లారా టెస్టు రికార్డుని బద్దలు కొట్టే ఆ ఇద్దరు భారత ఆటగాళ్లు ఎవరో ఓ ఇంటర్యూలో వెల్లడించాడు. ఈ సందర్భంగా లారా మాట్లాడుతూ "వాస్తవానికి ఇది ఒక రకమైన విధి అని నేను అనుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.

వార్నర్‌కు ఓ అవకాశం ఇవ్వాల్సింది

వార్నర్‌కు ఓ అవకాశం ఇవ్వాల్సింది

"అడిలైడ్ లాంటి స్టేడియంలో వార్నర్‌కు ఓ అవకాశం ఇవ్వాలి అని నేను భావించాను. ఆస్ట్రేలియా డిక్లేర్ ప్రకటించబోతోందని తెలిసినప్పటికీ... అతడికి ఐదు లేదా 10 ఓవర్లు అవకాశం ఇవ్వాల్సింది. అతనికి కూడా చెప్పాల్సింది. ఎందుకంటే అతను చాలా మంచి ట్వంటీ 20 బ్యాట్స్ మన్" అని లారా వెల్లడించాడు.

టీ20 మూడ్ తరహాలో ఆడాల్సింది!

టీ20 మూడ్ తరహాలో ఆడాల్సింది!

"వార్నర్‌కు 'టీ20 మూడ్ తరహాలో ఆడు, సాధ్యమైతే ఆ రికార్డు కోసం ప్రయత్నించు' అని చెబితే బాగుండేది. చూసేందుకు ఇది చాలా బాగుంటుంది. రికార్డులు ఉంది బద్దలయ్యేందుకే, అదే నేను కూడా కోరుకుంటాను. సర్ డాన్ బ్రాడ్‌మన్ సాధించిన విజయాల పట్ల ప్రతి ఒక్కరికీ ఎంతో గౌరవం ఉంది. కానీ, వార్నర్ కొంచెం ప్రయత్నించి ఉండాల్సింది" అని లారా అన్నాడు.

తన చిరకాల రికార్డును బద్దలు కొట్టే

తన చిరకాల రికార్డును బద్దలు కొట్టే

భవిష్యత్తులో తన చిరకాల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని భావించిన ఇద్దరు భారతీయ బ్యాట్స్‌మెన్‌లపై లారా ప్రశంసల వర్షం కురిపించాడు. "రోహిత్ శర్మ లాంటి ఆటగాడు మీకు తెలిసి అతడు టెస్ట్ క్రికెటర్ కాదా అని మీరు ఆశ్చర్యపోతారు. ఓ మంచి రోజున, తనదైన రోజున, ఓ మంచి పిచ్‌లో అతడు దీనిని బద్దలు కొట్టగలడు" అని లారా తెలిపాడు.

పృథ్వీ షా కూడా

పృథ్వీ షా కూడా

"ఈ రికార్డు అందుకోవడానికి అటాకింగ్ అవసరం. అలాంటి ఆటగాళ్లలో పృథ్వీ షా ఒకడు. అతడి వయసు 19 ఏళ్లు. తన ముందు ఇంకా చాలా ప్రపంచం ఉంది. త్వరలోనే అతడు తిరిగి ఫామ్‌ని అందుకుంటాడని ఆశిస్తున్నా" అని బ్రియాన్ లారా తెలిపాడు.

Story first published: Monday, December 9, 2019, 12:40 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X