న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కామెంటేటర్‌గా మారిన మంధాన, ఇంగ్లాండ్‌లో హిందీని నేర్పుతూ..

KSL 2018: Smriti Mandhana makes commentary debut after explosive start in Kia Super League- Watch

హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్‌ స్మృతీ మంధాన ప్రతిష్టాత్మక కియా సూపర్‌ టీ20 లీగ్‌లో ఆడతున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అరంగేట్రం మ్యాచ్‌లోనే భారత క్రికెటర్‌ స్మృతి మంధాన అదరగొట్టింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న దేశీవాలీ లీగ్ కియా సూపర్ లీగ్‌లో కామెంటేటర్‌గా మారింది. కియా సూపర్‌ లీగ్‌ అరంగేట్రపు మ్యాచ్‌లోనే ఈ భారత మహిళా క్రికెటర్‌ సత్తా చాటింది.

తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకుని:

టోర్నీలో వెస్ట్రన్‌ స్టార్మ్‌ తరఫున ఆడిన ఆమె 20 బంతుల్లో 48 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకుంది. ఈ విజయానంతరం ఆమె వ్యాఖ్యాత ఇషాగుహతో కలిసి కొద్దిసేపు సరదాగా కామెంటేటర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

 మంధాన మెరుపులకు తోడు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(96)

మంధాన మెరుపులకు తోడు కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(96)

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ డైమండ్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష‍్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్‌ స్ట్రోమ్‌ జట్టును మంధాన, కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(96; 62 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు)లు దాటిగా ఆడి 15.3 ఓవర్లలోనే విజయాన్నందించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక మంధాన ఇన్నింగ్స్‌పై భారత అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

యార్క్‌షైర్‌ డైమండ్స్‌ జట్టుపై ఘన విజయం

యార్క్‌షైర్‌ డైమండ్స్‌ జట్టుపై ఘన విజయం

టాంటన్‌లోని కౌంటీ మైదానంలో జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో వెస్ట్రన్‌ స్టార్మ్‌ జట్టు.. యార్క్‌షైర్‌ డైమండ్స్‌ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన తనకు హిందీ నేర్పించిందని హీదర్‌ నైట్‌ చెప్పింది. అదీ మ్యాచ్‌ మధ్యలోనట. ఇద్దరూ కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మధ్యలో తనకు కొన్ని హిందీ పదాలు నేర్పిందని తెలిపింది.

బ్యాటింగ్‌ మధ్యలో హిందీ పదాలు నేర్పింది

బ్యాటింగ్‌ మధ్యలో హిందీ పదాలు నేర్పింది

‘మంధానతో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఎంతో సరదాగా ఉంది. ఆమె మధ్యలో నాకు కొన్ని హిందీ పదాలు నేర్పింది.' అంటూ మ్యాచ్‌ అనంతరం నైట్‌ ట్విటర్‌లో పేర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ జట్టు 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం వెస్ట్రన్‌ స్టార్మ్‌ జట్లు 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Story first published: Tuesday, July 24, 2018, 14:54 [IST]
Other articles published on Jul 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X