న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా ఇంతకంటే ఏం కావాలి: రోహిత్ శర్మ

India Vs West Indies T20I,2018: India Beat West Indies, Take 1-0 Lead
Krunal Pandya wanted to bowl to Kieron Pollard and got him out: Rohit Sharma

హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ఆరంభంలోనే అవుట్. పరిస్థితి దారుణంగా మారుతున్న తరుణంలో దినేశ్ కార్తీక్ రెచ్చిపోవడంతో టీమిండియా టార్గెట్‌ను చేధించి తొలి టీ20ని గెలిచింది.

ఓపెనర్లు సరిగా రాణించలేకపోయినప్పటికీ

ఓపెనర్లు సరిగా రాణించలేకపోయినప్పటికీ

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లతో పాటు రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, మనీశ్ పాండేలు ఆశించిన మేర రాణించనప్పటికీ దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్యాలు ఆదుకోవడంతో భారత్‌ చివరకు గట్టెక్కింది. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో కృనాల్‌ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అజేయంగా 21 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బౌలింగ్‌ చేసేటప్పుడు కృనాలే అడిగి

బౌలింగ్‌ చేసేటప్పుడు కృనాలే అడిగి

కాగా, భారత్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు మాత్రం కృనాల్‌ అడిగి మరీ బౌలింగ్‌ తీసుకున్న విషయాన్ని మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. ‘ విండీస్‌ కీలక ఆటగాడు పొలార్డ్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో నేను బౌలింగ్‌ చేస్తానని కృనాల్‌ అడిగాడు. ఆ వికెట్‌ కోసం కృనాల్‌ పట్టుబట్టీ మరీ బౌలింగ్‌ చేశాడు. అలా అడిగా బౌలింగ్‌ చేయడమే కాదు.. పొలార్డ్‌ వికెట్‌ను కూడా కృనాల్‌ ఖాతాలో వేసుకున్నాడు.' అని కృనాల్‌ను కొనియాడుతూ.. రోహిత్ చెప్పుకొచ్చాడు.

3 ముంబై ఇండియన్స్‌కు చెందిన వారే

3 ముంబై ఇండియన్స్‌కు చెందిన వారే

గమనించాల్సిన విషయం ఏమిటంటే కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మ ముగ్గురు ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన వారే కావడం గమనార్హం. ఇదే క్రమంలో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడే పొలార్డ్‌ను కృనాల్‌ దగ్గర్నుంచి గమనించడం కూడా బౌలింగ్‌ అడిగేందుకు ఓ కారణమంటూ కెప్టెన్ తెలిపాడు.

ఇంతకంటే కెప్టెన్‌కు కావాల్సింది

ఇంతకంటే కెప్టెన్‌కు కావాల్సింది

'ఒక జట్టు ఏమైతే ఆశిస్తుందో అదే కృనాల్‌ చేసి చూపెట్టాడు. ఇలా ప్రతీ క్రికెటర్‌ తమ ఛాలెంజ్‌లను సమర్ధవంతంగా నిర్వర్తించేటప్పుడు కెప్టెన్‌కు కావాల్సింది ఏముంటుంది' అని రోహిత్‌ తెలిపాడు. కృనాల్‌.. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీసిన కృనాల్‌.. ఛేదనలో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Story first published: Monday, November 5, 2018, 13:07 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X