ఈడెన్‌లో అరుదైన రికార్డుని సృష్టించిన కోల్‌కతా నైట్ రైడర్స్

Posted By:

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా అరుదైన ఘనత సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌‌లో వరుసగా 12 విజయాలు సాధించి రికార్డు నెలకొల్పింది. శుక్రవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా కోల్‌కతా ఈ రికార్డుని సొంతం చేసుకుంది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 7 మ్యాచ్‌లలో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో తొలుత ప్లేఆఫ్‌కు చేరిన జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. శుక్రవారం ఢిల్లీపై కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ 52 బంతుల్లో 71), రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 59) రాణించడంతో కోల్‌కతా హ్యాట్రిక్‌ విజయం సాధించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60), శ్రేయాస్‌ అయ్యర్‌ (47) పరుగులతో రాణించారు. శాంసన్‌ తొలి వికెట్‌కు కరుణ్‌ నాయర్‌తో 48 పరుగులు జోడించాడు.

32 బంతుల్లో అర్ధ సెంచరీ

32 బంతుల్లో అర్ధ సెంచరీ

ఉమేష్‌ వేసిన రెండో ఓవర్‌లోనే శాంసన్‌ ఫోర్‌, సిక్సర్‌ బాదాడు. కరుణ్‌ (15) అవుటయ్యాక సంజూతో శ్రేయాస్‌ జత కలిశాడు. అయితే ఐదో ఓవర్‌ నుంచి కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్కోరు బోర్డు వేగం తగ్గింది. కుల్దీప్‌ వేసిన 12వ ఓవర్‌లో శాంసన్‌ కళ్లు చెదిరే సిక్సర్‌తో 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

ఎల్బీగా వెనుదిరిన సంజూ శాంసన్

ఎల్బీగా వెనుదిరిన సంజూ శాంసన్

తర్వాత శ్రేయస్‌ కూడా 4, 6, 4, 4తో జోరు ప్రదర్శించాడు. ఉమేష్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి జోరు మీదున్న సంజూ ఆ వెంటనే ఎల్బీగా వెనుదిరిగాడు. చివర్లో రిషభ్‌ పంత్ (6), శ్రేయాస్‌ అయ్యర్‌ను కౌల్టర్‌ నైల్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్‌ నైల్‌ 3 వికెట్లు తీసుకోగా.. ఉమేష్‌, నరైన్‌ చెరో వికెట్‌ తీశారు.

రెండో ఓవర్లోనే ఓపెనర్‌ నరైన్‌‌ను కోల్పోయిన కోల్‌కతా

రెండో ఓవర్లోనే ఓపెనర్‌ నరైన్‌‌ను కోల్పోయిన కోల్‌కతా

అనంతరం 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా రెండో ఓవర్లోనే ఓపెనర్‌ నరైన్‌ (4)ను కోల్పోయినా వెనక్కి తగ్గలేదు. ఈ సీజన్లో జోరు మీదున్న గంభీర్‌, ఊతప్ప మరోసారి సత్తా చాటారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడీ, ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

కమిన్స్‌ బౌలింగ్‌లో ఊతప్పకు లైఫ్

కమిన్స్‌ బౌలింగ్‌లో ఊతప్పకు లైఫ్

కమిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాబిన్‌ ఊతప్ప, ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. ఈ క్రమంలోనే రాబిన్‌ 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాబిన్ ఉతప్ప(33 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో రాణించారు.

గంభీర్-ఊతప్పల జోడీ 108 పరుగుల భాగస్వామ్యం

గంభీర్-ఊతప్పల జోడీ 108 పరుగుల భాగస్వామ్యం

వీరిద్దరూ కలిసి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఈ సీజన్‌లో కోల్‌కతా మరో ఘన విజయాన్ని సాధించింది. 2012 నుంచి ఈడెన్‌ గార్డెన్స్‌లో ఛేదనలో కోల్‌కతా ఓడిపోకపోవడం విశేషం. ఈ సీజన్‌లో కోల్‌కతా‌కు ఇది ఏడో విజయం కాగా, ఢిల్లీకి ఐదో ఓటమి కావడం విశేషం.

Story first published: Saturday, April 29, 2017, 11:37 [IST]
Other articles published on Apr 29, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి