న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా అతనింకా ఎంతో నేర్చుకోవాలి: గంభీర్‌

IPL 2019 : Virat Kohli Still An 'Apprentice' Says Gautam Gambhir || Oneindia Telugu
Kohli is a master, but captain Kohli an apprentice says Gautam Gambhir

ఐపీఎల్‌ సీజన్‌-12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటముల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేసింది. ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో వరుసగా ఓడి పాయింట్ల ఖాతానే తెరవలేదు. దీంతో ప్లే ఆఫ్‌కు వెళ్లే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా 6 మ్యాచ్‌లలో విజయమే లేకపోవడంతో.. బెంగళూరు అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అక్కడే బెంగళూరు తప్పిదాలు చేసింది:

అక్కడే బెంగళూరు తప్పిదాలు చేసింది:

ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌.. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై విమర్శల వర్షం కురిపించాడు. 'ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు ఒక్క విజయం కూడా సాధించకపోవడానికి కారణం కోహ్లీయే. ఓటములకు బౌలర్లను నిందించడానికి బదులు తానే బాధ్యత తీసుకోవాలి. వేలంలో క్రికెటర్లను ఎంచుకోవడంలోనే బెంగళూరు తప్పిదాలు చేసింది. లీగ్ ప్రారంభం నుంచి అందుబాటులో ఉండని స్టొయినిస్‌, కల్టర్‌ నైల్‌లను ఎలా తీసుకొన్నారు' అని గంభీర్ ప్రశ్నించాడు.

కెప్టెన్‌గా ఇంకా అప్రెంటిసే:

కెప్టెన్‌గా ఇంకా అప్రెంటిసే:

'బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ మాస్టరే.. కానీ కెప్టెన్‌గా ఇంకా అప్రెంటిసే. కెప్టెన్‌గా అతనింకా ఎంతో నేర్చుకోవాలి. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో.. సిరాజ్‌ ఓవర్‌ను స్టొయినిస్‌తో వేయించకుండా స్పిన్నర్‌ పవన్‌ నేగితో వేయించాల్సింది. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలే మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయి' అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

సునాయాస విజయం:

సునాయాస విజయం:

ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్షంను ఢిల్లీ 18.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ 67‌ (50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం సాధించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కోహ్లీ 41 (33 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు), అలీ 32 (18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడ 4 వికెట్లు తీసాడు.

Story first published: Monday, April 8, 2019, 10:48 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X