న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సీజన్‌లో అత్యుత్తమం: ఈడెన్‌లో కోల్‌కతాపై ముంబై భారీ విజయం

By Nageshwara Rao
MI

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవడంతో 18.1 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ప్లే ఆఫ్‌ దిశగా సాగుతోన్న ముంబై ఇండియన్స్‌కు వరుసగా మూడో గెలుపు కాగా.. కోల్‌కతా తమ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది.

తాజా విజయంతో ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ముంబై బౌలర్లలో పాండ్యా బ్రదర్స్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కండేయ, బెన్ కటింగ్‌, బుమ్రా, మెక్లన్‌గన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో రెండు రనౌట్‌లు ఉండటం విశేషం. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

1
43451

16 ఓవర్లకు కోల్‌కతా 103/8
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. క్రీజులో కుల్దీప్ యాదవ్(3), టామ్ కుర్రన్(17) పరుగులతో ఉన్నారు. అంతకముందు పియూష్ చావ్లా(11), రింకు సింగ్(5) వికెట్లను కోల్‌కతా కోల్పోయింది.


పీకల్లోతు కష్టాల్లో కోల్‌కతా: 10 ఓవర్లకు 72/6
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో కోల్ కతా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్ తొలి బంతికి జెపీ డుమిని... దినేష్ కార్తీక్ (5)ని రనౌట్ చేయగా, ఆ తర్వాత బంతికి నితీష్ రాణా(21) పరుగుల వద్ద బెన్ కటింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో రింకు సింగ్(1), టామ్ కుర్రన్(4) పరుగులతో ఉన్నారు.


8 ఓవర్లకు కోల్‌కతా 54/4
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే తడబడి వరుసగా వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే సునీల్ నరైన్ (4) ఔటవగా ఆ తర్వాత లేని పరుగు కోసం యత్నించి క్రిస్‌లిన్ (21) పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (14), రసెల్ (2) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(21), దినేశ్ కార్తీక్(5) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన కోల్‌కతా
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ మెక్లన్‌గన్ వేసిన తొలి ఓవర్‌లో ఓపెనర్ సునీల్ నరైన్(4) భారీ షాట్‌కు ప్రయత్నించి కృనాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఒక ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 12 పరుగులు చేసింది. క్రీజ్‌లో లిన్(8), ఉతప్ప(0) పరుగులతో ఉన్నారు.


కోల్‌కతా విజయ లక్ష్యం 211

ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (62: 21 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

మ్యాచ్ ఆరంభంలోనే ఓపెన్ ఎవిన్ లూవిస్(18) వికెట్ తీసిన కోల్‌కతా, ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (36) పవర్ ప్లేలో దూకుడుగా ఆడగా, మిడిల్ ఓవర్లలో ఇషాన్ కిషన్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (36), హార్దిక్ పాండ్యా (19: 13 బంతుల్లో 2 సిక్సులు) రాణించారు.

ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6 బాదిన ఇషాన్ కిషన్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో బెన్ కటింగ్ (24: 8 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులు) సిక్సర్ల మోత మోగించాడు. చావ్లా వేసిన ఆఖరి ఓవర్‌లో ముంబై 22 పరుగుల్ని పిండుకున్నాడు.

చావ్లా బౌలింగ్‌లో బెన్ కటింగ్ తొలి మూడు బంతుల్ని 6, 6, 4గా మలచగా.. ఆఖరి బంతిని కృనాల్ పాండ్యా సిక్స్‌గా మలిచాడు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 211 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా బౌలర్లలో పియూష్ చావ్లా 3 వికెట్లు తీసుకోగా... ప్రసాద్ కృష్ణన్, టామ్ కరాన్, సునీల్ నరైన్‌ తలో వికెట్ తీసుకున్నారు.


ఈడెన్‌లో మ్యాచ్: 17 ఓవర్లకు ముంబై 162/3
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి ఇషాన్ కిషన్(62) పరుగుల వద్ద కీపర్ రాబిన్ ఊతప్పకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు కుల్దీప్ యాదవ్ వేసిన 14వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ వరుసగా 4 సిక్సులు బాదాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను ముంబై 3 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(6), రోహిత్ శర్మ (35) పరుగులతో ఉన్నారు.


9 ఓవర్లకు ముంబై 62/2
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. పియాష్ చావ్లా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్(36) పరుగుల వద్ద రింకు సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి ముంబై 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(7), రోహిత్ శర్మ (9) పరుగులతో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ముంబై
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. చావ్లా వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి లివీస్‌(18) క్రిస్‌ లిన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(29), రోహిత్ శర్మ(3) ఉన్నారు.


3 ఓవర్లకు ముంబై 24/0
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 24 పరుగులతో నిలిచింది. క్రీజులో సూర్య కుమార్‌ యాదవ్‌ (17), ఎవిన్‌ లూయిస్‌ (7) పరుగులతో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ దూకుడుగా ఆడుతున్నాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతా తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయపడిన శుభమాన్ గిల్ స్థానంలో రింకూ సింగ్, మిచెల్ జాన్సన్ స్థానంలో టామ్ కుర్రన్‌లకు చోటు దక్కింది. ఎలాంటి మార్పులు లేకుండానే ముంబై బరిలోకి దిగుతోంది.

టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన కోల్‌కతా జట్టు ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. నాలుగింట విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ జట్టు పాయింట్ల పట్టకిలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకాలని కోల్‌కతా అనుకుంటుంది.

ఐపీఎల్ 2018 సీజన్‌లో ప్లే ఆఫ్‌ ఆశలు నిలవాలంటే ఇప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఆడే అన్ని మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కోల్‌కతాని ఓడించిన ముంబై ఇండియన్స్.. అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా.. ముంబైపై ప్రతీకారం తీర్చుకోవాలని కోల్‌కతా ఆశిస్తోంది.

ఇరు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో మ్యాచ్‌పై అంచనాలు నెలకొన్నాయి. కోల్‌కతా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటం ఆ జట్టుకి అనుకూలంగా మారే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:

సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లివీస్, రోహిత్ శర్మ(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జీన్ పాల్ డుమినీ, ఇశాన్ కిషన్(కీపర్), బెన్ కట్టింగ్, మిషెల్ మెక్‌క్లాగాన్, మయాంక మార్ఖండే, జస్ప్రీత్ బుమ్రా.

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, దినేశ్ కార్తీక్(కెప్టెన్/కీపర్), రింకూ సింగ్, అండ్రే రస్సెల్, పియూష్ చావ్లా, టామ్ కgర్రన్, ప్రశిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.

Story first published: Wednesday, May 9, 2018, 23:49 [IST]
Other articles published on May 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X