న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌గా డేవిడ్‌ హస్సీ.. బౌలింగ్‌ కోచ్‌ కైల్‌ మిల్స్‌

KKR appoint David Hussey as chief mentor, Kyle Mills as bowling coach for upcoming IPL season

న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్‌ హస్సీ నియమితులయ్యారు. అలాగే బౌలింగ్‌ కోచ్‌గా కివీస్‌ మాజీ పేసర్‌ కైల్‌ మిల్స్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం కేకేఆర్‌ సీఈవో, ఎండీ వెంకీ మైసూర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గత మూడు సీజన్లుగా కేకేఆర్‌ జట్టు అంచనాలను అందుకోలేకతోంది. ఈ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమవడంతో కేకేఆర్‌ యాజమాన్యం మార్పులు చేర్పులు చేస్తోంది.

ఒంటిచేత్తో 'జడేజా' స్టన్నింగ్ రిటర్న్‌ క్యాచ్‌.. నోరెళ్లబెట్టిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌!!ఒంటిచేత్తో 'జడేజా' స్టన్నింగ్ రిటర్న్‌ క్యాచ్‌.. నోరెళ్లబెట్టిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌!!

కేకేఆర్‌ సహాయ సిబ్బంది మొత్తాన్ని ప్రాంఛైజీ ప్రక్షాళన చేస్తోంది. ఇందులో భాగంగానే న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను ఇటీవలే ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్త మెంటార్‌, బౌలింగ్‌ కోచ్‌ను ఎంపిక చేసింది. 'కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కుటుంబంలోకి డేవిడ్‌ హస్సీ, కైల్‌ మిల్స్‌కు స్వాగతం. ఆటగాళ్లుగా, గొప్ప వ్యక్తులుగా వారి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. కేకేఆర్‌కు వారి సేవలు అమూల్యమైనవి' అనిఎండీ వెంకీ మైసూర్‌ పేర్కొన్నారు.

డేవిడ్‌ హస్సీ తన కెరీర్‌లో 300పైగా టీ20లు ఆడాడు. ఇక 2008 నుంచి 2010 వరకు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం కూడా వహించాడు. 2015లో కివీస్‌ తరఫున కెరీర్‌ను ముగించిన కైల్‌ మిల్స్‌ 170 వన్డేల్లో 240 వికెట్లు తీశాడు. కివీస్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు మిల్స్‌. దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాక్వస్ కల్లిస్ స్థానాన్ని మెక్‌కలమ్‌ భర్తీ చేసాడు.

2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెకల్లమ్.. ఇటీవలే అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. మొదటి నుంచీ నైట్‌రైడర్స్‌ జట్టుతో కల్లమ్‌కు అనుబంధం ఉంది. మెక్‌కల్లమ్‌ను ఆరంభ సీజన్‌లో కేకేఆర్ వేలంలో సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ ఆడిన తొలి మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐదు సీజన్ల పాటు కేకేఆర్ జట్టుకే మెక్‌కల్లమ్ ఆడాడు. 2012 విజేతగా నిలిచిన కోల్‌కతా జట్టులోనూ కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌తో పాటు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని నైట్‌రైడర్స్‌కే చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్లకూ బ్రెండనే కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Story first published: Sunday, October 6, 2019, 18:41 [IST]
Other articles published on Oct 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X