న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం.. ఇంకాస్త పదును పెరిగితే'

Kane Williamson Out Of Form Jasprit Bumrah: A Threat With Ball In Hand

మౌంట్ మాంగనుయ్: చేతిలో బంతి ఉంటే భారత పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఎంతో ప్రమాదకరం. అయితే బుమ్రా బౌలింగ్‌లో కాస్త పదును పెరగాలి అని న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌ను 0-3తో కోల్పోయి భారత్ వైట్‌వాష్ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా పూర్తిగా విఫలమయినా.. విలియమ్సన్‌ పొగడడం విశేషం.

<strong>వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ కోల్పోయిన బుమ్రా.. కోహ్లీ మాత్రం!</strong>వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ కోల్పోయిన బుమ్రా.. కోహ్లీ మాత్రం!

 బుమ్రా ఎంతో ప్రమాదకరం

బుమ్రా ఎంతో ప్రమాదకరం

కేన్ విలియమ్సన్‌ మాట్లాడుతూ... 'అన్ని ఫార్మాట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్‌. ఈ విషయం మన అందరికీ తెలుసు. ప్రస్తుతం అతడు బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం. అయితే.. అతడి బౌలింగ్‌లో కాస్త పదును పెరగాలి. అతడి విషయంలో టీమిండియాకు ఎలాంటి అనుమానాలు వద్దు. ఏ సమయంలోనైనా పుంజుకోగలడు' అని విలియమ్సన్‌ తెలిపాడు.

30 ఓవర్లు.. 167 పరుగులు

30 ఓవర్లు.. 167 పరుగులు

ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌ అయిన బుమ్రా.. న్యూజిలాండ్‌ సిరీస్‌లో సాధారణ బౌలర్‌లా బౌలింగ్ చేసాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో మొత్తం 30 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 5.56 ఎకానమీతో 167 పరుగులిచ్చాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ఇదే తొలిసారి.

పునరాగమనంలో తేలిపోయాడు

పునరాగమనంలో తేలిపోయాడు

గత ఏడాది గాయం కారణంగా మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన బుమ్రా.. ఈ ఏడాది ఆరంభంలో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే పునరాగమనంలో మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన పదునైన యార్కర్లని సంధించడంలో తేలిపోతున్నాడు. దీంతో ప్రత్యర్థి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు కూడా బుమ్రా బౌలింగ్‌లో అలవోకగా బౌండరీలు బాదేస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. కనీసం టెస్టుల్లోనైనా లయ అందుకోవాలని భారత యాజమాన్యం కోరుకుంటోంది.

అద్భుతమైన జట్టుపై అత్యద్భుత ప్రదర్శన

అద్భుతమైన జట్టుపై అత్యద్భుత ప్రదర్శన

'ఇది మా అత్యుత్తమ ప్రదర్శన. చాలా కీలకమైన సమయంలో భారత్ మమ్మిల్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. కానీ మా వాళ్లు ధీటుగా పోటీ ఇచ్చారు. బంతితో ప్రత్యర్థిని కట్టడి చేసి.. భారీ స్కోర్ సాధించకుండా చేశారు. భారత్ అన్ని ఫార్మాట్లలో ఎంత పటిష్టంగా ఉన్నారో తెలిసిందే. ఎవరి పాత్ర వాళ్లు పోషించాలని మేము స్పష్టంగా అనుకున్నాం. అద్భుతమైన జట్టుపై మా ఆటగాళ్లు అత్యద్భుత ప్రదర్శన చేశారు' అని కేన్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, February 12, 2020, 16:26 [IST]
Other articles published on Feb 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X