న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైకి జాంటీ రోడ్స్ గుడ్ బై: కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్

By Nageshwara Rao
James Pamment replaces Jonty Rhodes as fielding coach at Mumbai Indians

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీరోడ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో అతడి స్థానంలో ముంబై ఇండియన్స్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ పామ్మెంట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.

జాంటీ రోడ్స్‌ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. జాంటీరోడ్స్ 2009 నుంచి 2017 సీజన్ వరకు ముంబైకి ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. ముంబై ఇండియన్స్ మూడు సార్లు(2013, 15, 17) ఐపీఎల్ టైటిల్ విజేతగా అవతరించడంలో రోడ్స్ కీలకపాత్ర పోషించాడు.

తన వ్యక్తిగత వ్యాపార కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రోడ్స్‌ చెప్పాడు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, అనిల్ కుంబ్లే, రికీ పాంటింగ్, జయవర్ధనే వంటి గొప్ప ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందితో తన తొమ్మిదేళ్ల ప్రయాణం అద్భుతంగా సాగిందని జాంటీ రోడ్స్ తెలిపాడు.

'అతని సహకారం వెలకట్టలేనిది. దానికి కొలమానమే లేదు. అతడు జట్టుకు పునాది. జాంటీ సహకారాన్ని మాటల్లో వర్ణించలేను' అని ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించాడు. జాంటీ రోడ్స్ స్థానంలో ముంబై ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎంపికైన జేమ్స్‌.. ప్రస్తుతం న్యూజిలాండ్‌ దేశవాళీ జట్టు నార్తరన్‌ డిస్ట్రిక్స్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 8, 2017, 9:23 [IST]
Other articles published on Dec 8, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X