ఇది జడేజా ప్రత్యకత: టైగా ముగిసిన గత రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి బంతిని ఆడాడు

హైదరాబాద్: ఆసియాకప్ టోర్నీలో భాగంగా సూపర్-4లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. భారత జట్టు టైగా ముగించిన గత చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆఖరి బంతని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజానే ఎదుర్కొనడం విశేషం.
దుబాయి వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 12 బంతుల్లో 13 పరుగులు చేయాలి. ఈ సమయంలో ఇద్దరు రనౌటయ్యారు. ఆ తర్వాత టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది.

ఐదో బంతికి ఔటైన జడేజా
కానీ, ఐదో బంతిని గాల్లోకి లేపిన జడేజా ఔట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అంతకముందు 2014లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా జడేజాను ఆఖరి బంతిని ఆడాడు.

2014లో న్యూజిలాండ్‌తో
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 314 పరుగులు చేసింది. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13.1 ఓవర్లకు భారత్ స్కోరు 72-2గా ఉంది.

అశ్విన్, జడేజా హాఫ్ సెంచరీ
మిడిలార్డర్ రాణించడంతో 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 184-6గా ఉంది. దీంతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్, జడేజాలు 65, 66 పరుగులతో రాణించారు. 31 బంతుల్లో భారత్ విజయానికి 45 పరుగులు అవసరమైన తరుణంలో అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications