న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెట్ ఘనతను సాధించడానికి కారణాలేంటి: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Asks Reason For Rise Of Indian Cricket, Fans Say Sourav Ganguly, MS Dhoni And Virat Kohli

హైదరాబాద్: భారత జట్టు వెటరన్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిమానులకి ఓ సరదా ప్రశ్న సంధించాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాడు. 'భారత క్రికెట్ ఇంతటి ఘనతను సాధించడానికి కారణాలేంటి. ఈ ప్రశ్న భారత క్రికెట్ ను ప్రేమించే వారందరికీ వర్తిస్తుంది' అని అందులో పేర్కొన్నాడు.

దీంతో అభిమానులందరూ ఒక్కో రీతిగా స్పందించారు. రకరకాల సమాధానాలు ఇచ్చారు. సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి అనే సమాధానాలతోనే ఎక్కువసేపు చర్చను నడిపించారు. ఇంకా, ఎవరికి వారు తమ అభిమాన క్రికెటర్లకి మద్దతు తెలుపుతూ రిప్లై ఇస్తున్నారు. మధ్యలో సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, కపిల్‌ దేవ్, సెహ్వాగ్, ద్రవిడ్ లాంటి దిగ్గజాల పేర్లు వచ్చినా.. చివరికి ముగ్గురు క్రికెటర్ల మధ్యే చర్చ తారస్థాయికి చేరింది.

భారత జట్టుకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌కి ప్రపంచకప్‌ అందించడమే కాకుండా.. కెప్టెన్‌గా ఒక టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనీది.

మరోవైపు.. తన బ్యాటింగ్ మెరుపులతో క్రికెట్ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న విరాట్ కోహ్లీ.. భారత్‌ని వన్డే, టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిపాడు. కలగానే మిగిలిపోతాయని అంతా భావించిన సచిన్ టెండూల్కర్ రికార్డుల్ని బద్దలు కొట్టగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లి ఇప్పుడు నిలిచాడు. దీంతో ఈ ముగ్గురు క్రికెటర్ల అభిమానుల మధ్యే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ఇలా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సమాధానాలతో కూడిన ట్వీట్లన్నీ. దాదాపు 1200మంది వరకు స్పందించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Story first published: Wednesday, February 21, 2018, 15:11 [IST]
Other articles published on Feb 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X