న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR మ్యాచ్ హైలెట్స్: ప్లేఆఫ్ రేసులో కోల్‌కతా ఆశలు సజీవం

By Nageshwara Rao
 IPL Highlights KKR vs RR at Eden Gardens: Kolkata Knight Riders beat Rajasthan Royals by 6 wickets

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌‌లో ప్లేఆఫ్ ఆశలను కోల్‌కతా నైట్‌రైడర్స్ సజీవంగా ఉంచుకుంది. టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ క్రిస్‌లిన్ (45), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41 నాటౌట్) రాణంచడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కి జోస్ బట్లర్ (39), రాహుల్ త్రిపాఠి (27) చక్కటి శుభారంభాన్నిచ్చినా.... మిడిల్ ఓవర్లలో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకే ఆలౌటైంది. కోల్‌కతా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/20) ధాటికి రాజస్థాన్ విలవిలలాడింది.

రాజస్థాన్ ఓపెనర్లు చక్కటి శుభారంభం

రాజస్థాన్ ఓపెనర్లు చక్కటి శుభారంభం

ఓపెనర్లు జోస్ బట్లర్, రాహుల్ త్రిపాఠి చెలరేగడంతో 4.4 ఓవర్లు ముగిసే సమయానికి 63 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రాహుల్ త్రిపాఠి(27)ని పరుగుల వద్ద రసెల్‌ పెవిలియన్‌కి చేర్చగా.. ఆ తర్వాత బట్లర్‌, రహానె (11)ని తాను వేసిన వరుస ఓవర్లలో కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు.

103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్

103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్

అనంతరం వచ్చిన సంజు శాంసన్ (12) స్పిన్నర్ నరైన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా.. స్టువర్ట్ బిన్నీ (1), బెన్‌స్టోక్స్ (11) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. చివర్లో హిట్టింగ్ చేసేందుకు యత్నించిన గౌతమ్ (3)‌ని శివమ్ మావి పెవిలియన్‌కు చేర్చడంతో 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ ఇబ్బందుల్లో పడింది.

చివర్లో మెరుపులు మెరిపించిన జయదేవ్ ఉనాద్కత్

చివర్లో మెరుపులు మెరిపించిన జయదేవ్ ఉనాద్కత్

ఈ దశలో క్రీజులోకి వచ్చిన జయదేవ్ ఉనాద్కత్ (18 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఆఖరి బంతికి జయదేవ్‌ని ప్రదీప్ బౌల్డ్ చేయడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు చక్కటి శుభారంభాన్నిచ్చారు.

తొలి ఓవర్‌లోనే 21 పరుగులు రాబట్టిన నరైన్

తొలి ఓవర్‌లోనే 21 పరుగులు రాబట్టిన నరైన్

ఓపెనర్ సునీల్ నరైన్ (7 బంతుల్లో 21) తొలి ఓవర్‌లోనే 21 పరుగులు రాబట్టాడు. ఇక, మిడిల్ ఓవర్లలో నితీశ్ రాణా (21) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుుకున్నాడు. చివర్లో క్రిస్‌లిన్ ఔటైనా.. ఆండ్రీ రసెల్ (11 నాటౌట్)తో కలిసి మరో 12 బంతులు మిగిలుండగానే దినేశ్ కార్తీక్ సిక్స్‌తో కోల్‌కతాకు విజయం అందించాడు. తాజా విజయంతో కోల్‌కతా 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవగా, రాజస్థాన్ ప్లేఆఫ్‌ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది.

Story first published: Wednesday, May 16, 2018, 12:39 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X