న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022 Qualifier 2, RCB vs RR: ఫలితం తేలని మూడు మ్యాచ్‌లు: ఇది నాలుగోది కాదు..కాబోదు

IPL 2022 Qualifier 2, RCB vs RR: Head to Head and Players records are here to know

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్ ఇవ్వాళ అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ బిగ్ ఫైట్‌కు వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఎలిమినేటర్‌‌కు ఆతిథ్యాన్ని ఇచ్చిన కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌ తరహా వర్షం అంతరాయాన్ని కలిగించే అవకాశాలు లేవు.

ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ ఇదీ..

ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ ఇదీ..

ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో క్వాలిఫయర్, ఫైనల్స్ నిర్వహించనుంది బీసీసీఐ. వన్డే ఇంటర్నేషనల్స్‌, టీ20లకు అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి- టీ20 మ్యాచ్‌ల కోసం దీన్ని రూపొందించారు. తొలి ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 174 పరుగులు కావడం దీనికి నిదర్శనం. రెండో ఇన్నింగ్ బ్యాటింగ్ యావరేజ్ 166. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్టు 200లకు పైగా స్కోర్‌ను సాధించే అవకాశాలు లేకపోలేదు.

మూడుసార్లు టై..

మూడుసార్లు టై..

ఐపీఎల్ హిస్టరీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు 27 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీదే పైచేయి. 13 సార్లు రాజస్థాన్‌ను ఓడించింది. మరో 11 సార్లు ఈ పింక్ టీమ్ ఆర్సీబీపై విజయాన్ని అందుకుంది. మరో మూడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. ప్లేఆఫ్స్‌లో అలాంటి పరిస్థితి తలెత్తడానికి ఏ మాత్రం అవకాశం లేదు. ఫలితం తేలని పరిస్థితే వస్తే.. విజేతను నిర్ణయించడానికి బీసీసీఐ ఇప్పటికే గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేసింది.

ప్లేయర్ల వ్యక్తిగత రికార్డులివీ..

ప్లేయర్ల వ్యక్తిగత రికార్డులివీ..

ఈ మ్యాచ్‌తో కొందరు ప్లేయర్లు- తమ వ్యక్తిగత రికార్డులను సవరించుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ 150 క్యాచ్‌లకు ఒక్క అంకె దూరంలో ఉన్నాడు. ఈ క్యాచ్ అందుకోన్నాడంటే- ఐపీఎల్ కలుపుకొని అన్ని టీ20ల్లో 150 ల్యాండ్ మార్క్‌కు చేరుకుంటాడు. ఇప్పటివరకు ఈ ఘనతను సాధించింది సురేష్ రైనా, రోహిత్ శర్మ మాత్రమే. అలాగే- టీ20ల్లో 950 ఫోర్లకు చాలా దగ్గరగా ఉన్నాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఇంకో నాలుగు సార్లు బంతిని బౌండరీ దాటించాడంటే ఆ రికార్డు కింగ్ కోహ్లీ ఖాతాలో పడుతుంది.

350 సిక్సర్ల క్లబ్‌లో జోస్ బట్లర్..

350 సిక్సర్ల క్లబ్‌లో జోస్ బట్లర్..

ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ 50 క్యాచ్‌లకు చేరువ అయ్యాడు. ఇంకొక్కటి మిగిలివుందంతే. ఎలిమినేటర్ సెంచరీ హీరో రజత్ పటిదార్ 50 సిక్సులకు చేరవయ్యాడు. టీ20 ఫార్మట్‌లో 49 సార్లు అతను బంతిని ఫెన్సింగ్ దాటించాడు. వంద బౌండరీలకూ అతను దగ్గరగా ఉన్నాడు. 94 ఫోర్లు కొట్టాడు. టీ20ల్లో జోస్ బట్లర్ ఓ చెక్కుచెదరని రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. 348 సిక్సర్లు కొట్టాడీ పించ్ హిట్టర్. రెండు సిక్సర్లను సాధించితే- 350 క్లబ్‌లో జాయిన్ అవుతాడు.

 మలింగ రికార్డుకు చేరువగా..

మలింగ రికార్డుకు చేరువగా..

మలింగ రికార్డుకు సమీపంలో నిలిచాడు ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా తన పేరును లిఖించుకోవడానికి చేరవగా ఉన్నాడు. దీనికోసం అతను మూడు వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ ఘనత లంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ పేరు మీద ఉంది. 70 మ్యాచ్‌లల్లో మలింగ 100 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్ మ్యాచ్‌ల సంఖ్య 77.

అమిత్ మిశ్రా రికార్డు చెరిపేస్తాడిక..

అమిత్ మిశ్రా రికార్డు చెరిపేస్తాడిక..

ప్రసిద్ధ్ కృష్ణ 50 వికెట్ల క్లబ్‌లో చేరడానికి రెడీగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అతను 45 వికెట్లు పడగొట్టాడు. యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీసుకుంటే ఓ అరుదైన రికార్డును అందుకుంటాడు. అమిత్ మిశ్ర రికార్డును చెరిపేస్తాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లను తీసుకున్న ప్లేయర్ ప్రస్తుతానికి అమిత్ మిశ్రా. 166 వికెట్లు పడగొట్టాడీ మాజీ ఢిల్లీ ఆటగాడు. యజువేంద్ర చాహల్ 164 వికెట్లు పడగొట్టాడు. ఇంకో రెండు వికెట్లు తీసుకుంటే థర్డ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడు.

Story first published: Friday, May 27, 2022, 9:36 [IST]
Other articles published on May 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X