న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs RR Playing 11, Qualifier 2: ఈ సాల కప్ నమ్దే: పింక్ టీమ్‌తో ఆర్సీబీ: ఇంకో రెండడుగులు

IPL 2022, Qualifier 2, RCB Playing 11 vs RR predictions: here the all details to know

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రోండో క్వాలిఫయర్‌ వచ్చేసింది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతూ వస్తోన్న రెండు పాతజట్లు ఇవ్వాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ఉంటుంది.

ఎలిమినేటర్‌లో..

ఎలిమినేటర్‌లో..

కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఎలిమినేటర్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను తుక్కు రేగ్గొట్టింది రాయల్ ఛాలెంజర్స్. స్టార్ బ్యాటర్స్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ విఫలమైనప్పటికీ- 207 పరుగుల భారీ టార్గెట్‌ను ప్రత్యర్థికి నిర్దేశించ గలిగింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ రజత్ పటిదార్ సెంచరీతో దుమ్ము లేపాడు. ప్లేఆఫ్స్‌లో సెంచరీ బాదిన రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జట్టు మొత్తాన్నీ భారీ స్కోర్‌తో ముందుకు నడిపించాడు.

బలమైన బ్యాటింగ్ లైనప్..

బలమైన బ్యాటింగ్ లైనప్..

ఇవ్వాళ్టి మ్యాచ్‌లో రజత్‌తో పాటు మిగిలిన బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకోగలిగితే రాజస్థాన్ రాయల్స్‌కు చుక్కలే. ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు రజత్ పటిదార్ ఓపెనర్‌గా ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయం. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్‌తో కూడిన టాప్, మిడిలార్డర్‌లో బలంగా ఉంది. దినేష్ కార్తీక్ ఆటతీరు ఎలా ఉంటుందనేది మనకు కొత్తేమీ కాదు. లీగ్ దశలో చూసిందే. తన ఫామ్‌తో మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోగలిగాడు.

ఆర్సీబీపై ఫోకస్..

ఆర్సీబీపై ఫోకస్..

ఆరంభం నుంచి ఐపీఎల్‌లో కొనసాగుతూ ఇప్పటివరకు టైటిల్ గెలవని జట్లల్లో రాయల్ ఛాలెంజర్స్ ఒకటి. ఈ సాల కప్ నమ్దే అంటూ ప్రతీసారీ ఎన్నో ఆశలు పెట్టుకుని టోర్నమెంట్‌లోకి రావడం.. నిరాశతో వెనుదిరగడాన్ని చవి చూసింది. ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లడానికి ఇప్పుడు మరో అవకాశం లభించిందా జట్టుకు. ఎనిమిదో సారి ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. నాలుగో స్లాట్ కింద ఎంట్రీ ఇచ్చింది. ఈ సాయంత్రం రెండో క్వాలిఫయర్‌ను ఆడబోతోంది రాజస్థాన్ రాయల్స్‌తో.

ఈ సాల కప్ నమ్దే అనడానికి ఇంకో ఛాన్స్..

ఈ సాల కప్ నమ్దే అనడానికి ఇంకో ఛాన్స్..

తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇప్పుడు మరో అవకాశం లభించింది. ఛాంపియన్‌గా ఆవిర్భవించడానికి రెండడుగుల దూరం నిలిచింది. ఇవ్వాళ్టి రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేయగలిగితే ఫైనల్స్‌లో దర్జాగా అడుగు పెట్టగలుగుతుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఓడించగలిగితే- ఈ సాల కప్ నమ్దే అవుతుంది. దీని కోసం ఇంకో రెండు మ్యాచ్‌లను ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ రాయల్స్‌లో అతనొక్కడే..

రాజస్థాన్ రాయల్స్‌లో అతనొక్కడే..

ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఛాంపియన్‌గా ఆవిర్భవించిన రాజస్థాన్ రాయల్స్‌కు మళ్లీ అలాంటి అవకాశం దక్కలేదు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇదో గోల్డెన్ ఛాన్స్. ఇవ్వాళ్టి రెండో క్వాలిఫయర్‌లో ఆర్సీబీని, ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించగలిగితే- రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను ఎగరేసుకెళ్లినట్టవుతుంది. ఓపెనర్ జోస్ బట్లర్ మీదే బ్యాటింగ్ భారాన్ని మోపడం ఆ జట్టు ఆర్ఆర్ బలహీనత. తొలి క్వాలిఫయర్‌లో 88 పరుగులు చేసి, పరువు నిలిపాడీ ఇంగ్లాండ్ బ్యాటర్. కేప్టెన్ సంజు శాంసన్‌తో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు.

తీసిపోని బ్యాటింగ్ ఆర్డర్..

తీసిపోని బ్యాటింగ్ ఆర్డర్..

భారీ షాట్లను ఆడగలిగే సత్తా సంజు శాంసన్‌కు ఉన్నా నిలకడలేమి అతణ్ని వేధిస్తోంది. దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, మెరుపు వేగంతో పరుగులను సాధించాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్‌లో బౌలర్లు రాజస్థాన్ బౌలర్లు విఫలం అయ్యారు. రవిచంద్రన్ అశ్విన్ వికెట్ లెస్‌గా మారాడు. ట్రెంట్ బౌల్ట్, యజువేందర్ చాహల్, ఒబెద్ మెక్‌కే, ప్రసిద్ధ్ కృష్ణ భారీగా పరుగులను సమర్పించుకున్నారు. ఆ బలహీనత నుంచి బయటపడాల్సి ఉంటుంది.

తుదిజట్ల అంచనాలిలా..

తుదిజట్ల అంచనాలిలా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు- ఫాప్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌లో- జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కేప్టెన్-వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఒబెద్ మెక్‌కే, ప్రసిద్ధ్ కృష్ణ ఆడొచ్చు.

Story first published: Friday, May 27, 2022, 7:27 [IST]
Other articles published on May 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X