న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KL Rahul: అయిదోసారి 500. కళ్లు చెదిరేలా.. కుళ్లుకునేలా

KL Rahul needs 49 runs for completing 500 runs in the 5th consecutive IPL.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌‌‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్..ఈ సాయంత్రం కీలక మ్యాచ్ ఆడనుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్.. ఇప్పటికే సేఫ్ జోన్‌లో ఉంది. 10 మ్యాచ్‌లల్లో ఏడింట్లో విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

చివరి మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే- గుజరాత్‌తో సమానంగా నిలుస్తుందీ కేఎల్ రాహుల్ టీమ్. మంచి రన్‌రేట్‌తో ప్రత్యర్థిని ఓడించగలిగితే పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ఈ సీజన్‌లో కూడా లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్ ఊపు మీద ఉన్నాడు. ఇప్పటికే సెంచరీలు బాదాడు. ఈ రెండు కూడా ముంబై ఇండియన్స్‌పై నమోదు చేసినవే. ఐపీఎల్ టోర్నమెంట్ అనగానే.. కేఎల్ రాహుల్‌లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తుంది. దానికి తగినట్టుగా ఆడతాడీ వీర కన్నడిగ.

అయిదు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. 2018 నుంచీ టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తూ వస్తోన్నాడు. ఈ అయిదు సీజన్లల్లో 500లకు పైగా పరుగులు చేయడం అతని నిలకడకు అద్దం పడుతోంది. 2018లో 659 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక పరుగులు 95 నాటౌట్. 54.19 బ్యాటింగ్ సగటును రికార్డ్ చేశాడు. 2019లోనూ అదే దూకుడును కొనసాగించాడు.

ఈ సీజన్‌లో 593 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోర్ 100 నాటౌట్. బ్యాటింగ్ యావరేజ్ 53.90. ఒక సెంచరీ, ఆరు అర్ధసెంచరీలు సాధించాడు. 2020లోనూ అతని జోరుకు బ్రేకులు పడలేదు. ఏకంగా 670 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 132 నాటౌట్. ఒక సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 55.83. గత ఏడాది కూడా అదే స్పీడ్‌తో కొనసాగింది అతని బ్యాటింగ్ శైలి. 626 పరుగులు చేశాడు. 62.60 బ్యాటింగ్ యావరేజ్‌తో అతను బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 98 పరుగులు హయ్యెస్ట్ స్కోర్.

ఇక ఈ సీజన్‌లో 500 పరుగులకు చేరవ అయ్యాడు. ఇంకో 49 పరుగులు చేస్తే అతని 500 కోటా పూర్తవుతుంది. ఇప్పటికే రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీతో 451 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 56.38. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తోన్న తీరును బట్టి చూస్తోంటే ఈ సాయంత్రం కోల్‌కత నైట్‌రైడర్స్‌పై జరిగే మ్యాచ్‌లో ఈ 49 పరుగుల కొరతను పూర్తి చేసుకోవడం లాంఛన ప్రాయంగానే కనిపిస్తోంది.

Story first published: Saturday, May 7, 2022, 13:13 [IST]
Other articles published on May 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X