న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: నెట్టింట వైరల్‌గా మారిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ 'కుక్క' పేరు! ఎందుకో తెలుసా?

IPL 2021: RCB spinner Washington Sundar revels his pet dog name is Gabba

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వాషింగ్ట‌న్ సుంద‌ర్.. కుక్క పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత‌డు త‌న పెంపుడు కుక్క‌ను ప‌రిచ‌యం చేస్తూ.. దాని పేరును చెప్పడమే దీనికి అసలు కారణం. ఇంత‌కీ వాషింగ్ట‌న్ త‌న కుక్క‌కు పెట్టిన పేరేంటో తెలుసా.. 'గ‌బ్బా'. ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఉన్న స్టేడియం పేరే గ‌బ్బా. వాషింగ్ట‌న్ త‌న కుక్క‌ పేరును ప‌రిచ‌యం చేస్తూ ట్విట‌ర్‌లో షేర్ చేసిన పోస్ట్‌.. కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే వేల సంఖ్య‌లో కామెంట్స్‌, లైక్స్ సంపాదించింది.

కెరీర్‌ తొలి టెస్టు అంటే ఏ క్రికెటర్‌కైనా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అదే ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తే.. ఇక ఆ మైదానం, వేదిక సహజంగానే చిరస్మరణీయంగా మారిపోతుంది. గ‌బ్బా మైదానం కూడా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు అలానే నిలిచిపోయింది. ఆసీస్ పర్యటనలో భాగంగా గ‌బ్బా టెస్ట్ ద్వారా వాషింగ్ట‌న్ సుందర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్‌... శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. భారత్‌ స్కోరు 186/6గా ఉన్న దశలో వచ్చిన ఈ భాగస్వామ్యం చివర్లో కీలకంగా మారి జట్టు గెలుపునకు కారణమైంది.

వాషింగ్ట‌న్ సుందర్ తన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయ‌డమే కాకుండా.. తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన 62, రెండో ఇన్నింగ్స్‌లో 22 ప‌రుగులు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌తోనే అత‌డు పెద్ద హీరో అయిపోయాడు. దీంతో త‌న ముద్దుల కుక్క‌కు 'గ‌బ్బా' అని పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు మంచి కాప్షన్ పెట్టి అభిమానులకు దానిని పరిచయం చేశాడు. 'ప్రేమ అనేది నాలుగు కాళ్ల ప‌దం. గ‌బ్బాను పరిచయం చేసుకోండి' అంటూ కుక్క ఫొటో పోస్ట్ చేశాడు. సుందర్ భారత్ తరఫున 4 టెస్టులు, ఒక వన్డే, 31 టీ20లు ఆడాడు.

ప్రస్తుతం వాషింగ్ట‌న్ సుందర్ ఐపీఎల్ 2021 కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్లు వేసి.. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో ఈఏడాది కూడా అతడు కీలకం కానున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సుందర్‌పై ఇప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ఐపీఎల్లో 36 మ్యాచులు ఆడిన సుందర్.. 24 వికెట్లు పడగొట్టాడు. అలానే 186 రన్స్ కూడా చేశాడు.

‌IPL 2021: సారీ సీఎస్‌కే.. ఆ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ‌IPL 2021: సారీ సీఎస్‌కే.. ఆ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ

Story first published: Sunday, April 4, 2021, 17:23 [IST]
Other articles published on Apr 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X