న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 స్పెషాలిటీ ఇదే.. రివర్స్ సీన్: కొత్త ట్రెండ్: బ్యాట్స్‌మెన్లకు చుక్కలే

IPL 2021: Another bowler bags Man of the Match, fourth in 8 match

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021, 14వ ఎడిషన్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా సాగిన ఎనిమిదింట్లో అత్యధిక మ్యాచ్‌లల్లో లో-స్కోర్ రికార్డ్ కావడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంగా భావించే ఐపీఎల్ టోర్నమెంట్‌పై బౌలర్లు పెత్తనం చెలాయిస్తున్నారు. భారీ స్కోరు నమోదైంది మూడు మ్యాచుల్లోనే. ఈ క్రమంలో బౌలర్ల ఖాతాలో మరో మ్యాచ్ చేరింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన పోరులో బౌలర్లదే ఆధిపత్యం. రెండు జట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఐపీఎల్ తొలి మ్యాచుల్లో బౌలర్లు చెలరేగడం అరుదుగా చెప్పుకోవచ్చు.

Behind the scenes: ఏబీ డివిలియర్స్ వ్యక్తిగత విషయాలను వెల్లడించిన భార్యBehind the scenes: ఏబీ డివిలియర్స్ వ్యక్తిగత విషయాలను వెల్లడించిన భార్య

బౌలర్ల ఖాతాలో మరొకటి..

బౌలర్ల ఖాతాలో మరొకటి..

సాధారణంగా ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో బ్యాట్స్‌మెన్లదే ఇష్టారాజ్యం. చాలా సందర్భాల్లో బౌలర్లు ప్రేక్షకపాత్ర వహిస్తుంటారు. బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. ఈ సారి ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచులు దీనికి భిన్నంగా సాగుతున్నాయి. క్రమంగా బౌలర్లు పట్టు సాధిస్తున్నారు. బ్యాట్స్‌మెన్లపై పట్టు బిగిస్తున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తున్నారు. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ను అయినా లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులను సంధిస్తూ క్రీజ్‌లో కట్టి పడేస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ముగియగా.. వాటిల్లో నలుగురు బౌలర్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారంటే.. వారి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 ఆ లిస్ట్‌లో మరో బౌలర్..

ఆ లిస్ట్‌లో మరో బౌలర్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్, ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్, రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ స్టార్ జయదేవ్ ఉనద్కత్..ఇప్పటిదాకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. అదే జాబితాలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ చేరాడు. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఏ రేంజ్‌లో చెలరేగిపోయాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేద. 24 బంతుల్లో 18 డాట్ బాల్స్ సంధించాడతను నాలుగు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్ల కోటాలో దీపక్ చాహర్ ఇచ్చింది కేవలం 13 పరుగులే.

 106 పరుగులకే

106 పరుగులకే

పంజాబ్ కింగ్స్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లో రికార్డ్ స్కోరు సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 221 పరుగులు చేసింది. అలాంటి జట్టు తన మలి మ్యాచ్‌లో వంద పరుగులు చేయడానికే తలకిందులవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. దీపక్ చాహర్ బౌలింగ్ సత్తా అలాంటిది. మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికొలస్ పూరన్ వంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ నలుగురిలో ఏ ఒక్కరు కూడా భారీ స్కోరు చేయలేదు. మయాంక్ అగర్వాల్, నికొలస్ పూరన్ డకౌట్ అయ్యారు. ఇప్పటిదాకా చాహర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 3/13. కాగా ఇది కాస్తా 4/13గా మారింది.

నాలుగు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్

నాలుగు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్

ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ దీపక్ చాహర్. ఇదివరకు ముంబై ఇండియన్స్ బౌలర్ రాహుల్ చాహర్.. నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 27 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇక హర్షల్ పటేల్, కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్ ‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అయిదు వికెట్లు తీసుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎనిమిది మ్యాచుల్లోనే ఈ స్థాయిలో ఒకే బౌలర్ వికెట్లను పడగొట్టడం అసాధారణం. ఇలాంటి మ్యాచ్‌లు ఇదివరకెప్పుడు చోటుచేసుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Saturday, April 17, 2021, 8:05 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X