న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: కెప్టెన్సీ నుంచి కార్తీక్ వైదొలగడం వెనక అసలు కారణం ఇదే: గంభీర్

IPL 2020: Gautam Gambhir reveals truth behind Dinesh Karthiks decision to step down as KKR captain

ఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌)‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి శుక్రవారం దినేశ్ కార్తీక్ తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టు క్షేమం కోరి, బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు కార్తీక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. కేకేఆర్‌ పగ్గాలను ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అందుకున్నాడు. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసమే కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తున్నట్లు కార్తీక్ చెప్పినా.. అసలు నిజం అది కాదని కేకేఆర్‌ మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు.

ఇప్పుడు మారిస్తే ఏం ఉపయోగం

ఇప్పుడు మారిస్తే ఏం ఉపయోగం

తాజాగా గౌతమ్ గంభీర్ స్టార్ స్పోర్ట్స్‌లో.మాట్లాడుతూ... 'క్రికెట్ అనేది రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన అంశం కాదు. నిజాయతీగా చెప్పాలంటే.. ప్రదర్శనలకు సంబంధించింది. ఇప్పుడు ఇయాన్ మోర్గాన్ కేకేఆర్‌ కెప్టెన్ కావడం వల్ల పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు. లీగ్ ప్రారంభంలోనే మోర్గాన్‌ను సారథిగా నియమించి ఉంటే.. జట్టులో ఎన్నో మార్పులు చేయడానికి అతడికి అవకాశం ఉండేది. కానీ సీజన్ ఇప్పటికే సగం పూర్తయింది. ఇప్పుడు ఎంత మంచి కెప్టెన్ అయినా కూడా ఏమీ చేయలేడు. కోచ్, కెప్టెన్ మధ్య మంచి సంబంధాలు ఉండటం మేలు చేస్తుంది' అని అన్నాడు.

కార్తీక్‌పై ఒత్తిడి పెంచడం ఎందుకు

కార్తీక్‌పై ఒత్తిడి పెంచడం ఎందుకు

'గత రెండున్నర సంవత్సరాలుగా దినేష్ కార్తీక్ కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సీజన్ మధ్యలో కెప్టెన్‌ను మార్చేంత అత్యంత చెత్తగా కేకేఆర్‌ ప్రదర్శన మాత్రం లేదు. కెప్టెన్సీ మార్పు గురించి తెలియగానే నేను మొదటగా ఆశ్చర్యపోయా. కేకేఆర్‌ యాజమాన్యం ఈ నిర్ణయం ఆదిలోనే తీసుకుంటే బాగుండు. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ జట్టులో ఉన్నాడని పదేపదే మాట్లాడితే.. దినేశ్ కార్తీక్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెంచే బదులు ముందుగానే మోర్గాన్‌కు కెప్టెన్సీ అప్పగించాల్సింది' అని గౌతీ పేర్కొన్నాడు.

అసలు కారణం అదే

అసలు కారణం అదే

'బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసమే కెప్టెన్సీ వదులుకున్నానని ఎవరైనా చెప్పడం వినడానికి చాలా చాలా బాగుంటుంది. అయితే దినేష్ కార్తీక్ తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టడం కోసమే కెప్టెన్సీ వదులుకున్నానని చెబుతున్నా.. అతడి నాయకత్వం పట్ల తాము సంతృప్తిగా లేమని మేనేజ్‌మెంట్ నుంచి పదే పదే వార్తలు రావడమే కార్తీక్ నిర్ణయానికి అసలు కారణమై ఉంటుందని నేను భావిస్తున్నా' అని కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

 రెండుసార్లు టైటిల్స్

రెండుసార్లు టైటిల్స్

ఇంతకుముందు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్‌ తన దూకుడుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్‌లోనే కోల్‌కతా నాలుగో స్థానంకు చేరింది. తర్వాత రెండుసార్లు టైటిల్‌ సాధించింది. ఛాంపియన్‌ జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న దినేష్ కార్తీక్‌ మాత్రం గంభీర్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా విజయాల రేటు 56.48గా ఉండగా.. కార్తీక్‌ జట్టు పగ్గాలు అందుకున్నాక అది 51.52కు పడిపోయింది.

KKR vs MI: ఎంఎస్ ధోనీ ఏడేళ్ల రికార్డును సమం చేసిన ప్యాట్ కమిన్స్‌!!

Story first published: Saturday, October 17, 2020, 14:32 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X