న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్భజన్ స్నేక్ సింగ్: అతను పాములాంటోడు: గెంటేయడమే బెటర్: ధోనీ ఫ్యాన్స్ పుండు మీద కారం

IPL 2020: Chennai Super Kings Fans Slam Harbhajan Singh For ‘Dig’ At MS Dhoni

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ఏస్ బౌలర్ హర్భజన్ సింగ్.. తాజాగా టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. భజ్జీ పేరు వింటే భగ్గుమంటున్నారు ధోనీ ఫ్యాన్స్. హర్భజన్ సింగ్ పాములాంటోడని, అతణ్ని జట్టు నుంచి తొలగించడమే బెటర్ అంటూ తీర్మానించేస్తున్నారు. సొంత టీమ్ పట్ల, కేప్టెన్ పట్ల ఏ మాత్రం అతనికి అభిమానం లేదని, జట్టులోకి తీసుకుని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తప్పు చేసిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధోనీ అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ ఫాలోవర్లకు ఇంతలా ఆగ్రహాన్ని తెప్పించడానికి కారణం- ఓ చిన్న ట్వీట్. హర్భజన్ సింగ్ ఈ ట్వీట్ చేశాడు.

పుండు మీద కారం చల్లిన భజ్జీ..

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ.. అంపైర్ శాసించిన ఉదంతంపై లాఫింగ్ ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడతను. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో వైడ్ సిగ్నల్ ఇవ్వడానికి అంపైర్ పాల్ రీఫెల ప్రయత్నించడం, అదే సమయంలో ఎంఎస్ ధోనీ ఆయనను అడ్డుకోవడం వంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌ను యాడ్ చేసి పోస్ట్ చేసిన ఓ ట్వీట్టర్ యూజర్‌కు హర్భజన్ సింగ్ లాఫింగ్ ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు. ఇది ధోనీ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. వారికి మరింత మంటెక్కించినట్టయింది.

హర్భజన్ టార్గెట్‌గా ట్రోల్స్..

దీనితో వారు హర్భజన్ సింగ్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఘాటు కామెంట్లతో హర్భజన్ సింగ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2018లో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ హర్భజన్ సింగ్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకుందని మండిపడుతున్నారు. అతను పాములాంటోడని ఘాటు ఆరోపణలు సంధిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం వారు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆశ్రయించారే తప్ప.. క్రికెట్‌పై ఉన్న ప్రేమతో కాదంటున్నారు. ఆ వ్యక్తిగత కారణాలతోనే జట్టు ప్రయోజనాలను కూడా కాదని టోర్నమెంట్‌ ఆరంభానికి ముందే వెళ్లిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. సురేష్ రైనా కూడా దీనికి మినహాయింపేమీ కాదని చెబుతున్నారు.

డస్ట్‌బిన్‌లో పడేయండి..

నిలువెత్తు స్వార్థానికి హర్భజన్ సింగ్‌ను ప్రత్యక్ష ఉదాహరణగా చూపొచ్చని అభిమానులు విమర్శిస్తున్నారు. క్రికెట్ జీవితం చరమాంకంలో ఉన్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని పిలిచి మరీ జట్టులోకి తీసుకుందని, ఆ మాత్రం కృతజ్ఙత కూడా చూపించట్లేదని అంటున్నారు. ఓ తమిళ సినిమాలో కూడా నటించే అవకాశం చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా మాత్రమే హర్భజన్‌కు లభించిందని, ఇప్పడు అతను తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, అతణ్ని డస్ట్‌బిన్‌లో పడేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Story first published: Thursday, October 15, 2020, 14:36 [IST]
Other articles published on Oct 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X