న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: కోల్‌కతా ఓపెనర్‌గా మళ్లీ మిస్టరీ స్పిన్నర్?

IPL 2019 : Sunil Narine Returning From injury,He Can Deliver Once Again ? | Oneindia Telugu
IPL 2019: Returning from injury, can Sunil Narine deliver once again? KKR spin bowling coach gives his take

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. ఈ సీజన్‌లో కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తమ ఓపెనింగ్‌ జోడీలో ప్రయోగాలు చేపట్టనుందంటూ వార్తలు వస్తున్నాయి.

కోహ్లీనా లేక సురేశ్ రైనానా?: 5వేల పరుగుల క్లబ్‌లో ముందెవరు?కోహ్లీనా లేక సురేశ్ రైనానా?: 5వేల పరుగుల క్లబ్‌లో ముందెవరు?

2018 సీజన్‌లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ప్రయోగాత్మక ఓపెనర్‌గా కోల్‌కతా ఆడించగా అతడు ప్రొఫెషనల్ ఓపెనర్‌ కంటే మెరుగ్గా రాణించడమే కాదు పరుగుల మోత మోగించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ప్రత్యర్ధి జట్టు బౌలర్లను తనదైన హిట్టింగ్‌తో బౌండరీల మోత మోగించాడు.

ఎంతలా అంటే గత సీజన్‌లో సునీల్ నరేన్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్‌కి పోటీనిస్తూ ఏకంగా 357 పరుగులు చేశాడు. ఇక, బౌలింగ్‌లో తనకు తానే సాటి. తన మిస్టరీ స్పిన్‌ను అర్ధం చేసుకోలేని ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్ వికెట్లను సమర్పించుకునేవారు. గత సీజన్‌లో నరేన్ 17 వికెట్లు తీశాడు.

ఇటీవలే గాయం కారణంగా సునీల్ నరైన్ పీఎస్‌ఎల్‌కి కూడా దూరమయ్యాడు. తాజాగా ఫిట్‌నెస్ సాధించినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్ బౌలింగ్‌ కోచ్ కార్ల్ క్రో వెల్లడించాడు. "అవును.. చేతి వేలి గాయం కారణంగా పీఎస్‌ఎల్‌ టోర్నీకి నరైన్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఫిట్‌నెస్ సాధించాడు" అని చెప్పాడు.

"2019 సీజన్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనని మనం చూడబోతున్నాం. ఈసారి బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ అతను మెరుపులు మెరిపించనున్నాడు" అని క్రో ధీమా వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌‌లో తలపడనుంది.

Story first published: Thursday, March 21, 2019, 15:31 [IST]
Other articles published on Mar 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X