ఇంగ్లాండ్‌కు జోస్‌ బట్లర్‌.. త్వరలో మరో ఇద్దరు

IPL 2019 : Jos Buttler Ends IPL Stint Early Over Attend Birth Of His Child || Oneindia Telugu

ఐపీఎల్ సీజన్-12లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ జట్టుకు దూరం అయ్యాడు. బట్లర్‌ భార్య లౌసీ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. ఈ నేపథ్యంలో బట్లర్‌ తనకు పుట్టబోయే బిడ్డను చూసుకునేందుకు ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు.

 ఇంగ్లాండ్‌కు బట్లర్‌:

ఇంగ్లాండ్‌కు బట్లర్‌:

బట్లర్‌ ఏప్రిల్ నెల మొత్తం రాజస్థాన్‌ జట్టుతోనే ఉండాల్సి ఉంది. కానీ అనుకోకుండా బట్లర్‌ భార్య పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరడంతో.. వెంటనే ఇంగ్లాండ్‌కు వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్‌కు పయనమయిన కారణంతోనే ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ ఆడలేదు. గత మ్యాచ్‌లో బట్లర్‌ స్థానంలో సంజు సాంసన్ ఓపెనింగ్ చేసాడు.

 ఈ సీజన్‌లో 311 పరుగులు:

ఈ సీజన్‌లో 311 పరుగులు:

జోస్‌ బట్లర్‌ రాజస్థాన్‌ తరఫున ఈ సీజన్-12లో 8 మ్యాచ్‌లు ఆడి 38.87 సగటుతో 311 పరుగులు చేసాడు. ఇక స్ట్రైక్‌రేట్‌ కూడా 150కి పైనే ఉంది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో.. గత సీజన్‌లోనూ బట్లర్‌ మధ్యలోనే ఇంగ్లాండ్‌కు వెళ్ళిపోయాడు. అప్పుడు వరుసగా ఐదు అర్ధశతకాలు బాది.. రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

మరో ఇద్దరు కూడా:

మరో ఇద్దరు కూడా:

రాజస్థాన్‌ ప్రధాన ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా అర్చర్‌ ఏప్రిల్‌ 23న జట్టును వీడనున్నారు. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌ తర్వాత వీరిద్దరూ స్వదేశంకు వెళ్లిపోనున్నారు. ఐర్లాండ్, పాకిస్థాన్ సిరీస్ లు ఉన్న కారణంగా స్వదేశానికి పయనం కానున్నారు. రాజస్థాన్‌ ఆడిన 9 మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండవ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జట్టులో కీలక ఆటగాళ్లు అయిన ఈ ముగ్గురూ వీడనుండటం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 21, 2019, 15:33 [IST]
Other articles published on Apr 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X