వారి వల్లే ఫైనల్‌కు చేరాం: ధోనీ

IPL 2019,Qualifier 2 : MS Dhoni Credits Bowlers For Easy Win Over Delhi Capitals || Oneindia Telugu
d

కీలక సమయంలో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి వాళ్లే ప్రధాన కారణం అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ తెలిపారు. విశాఖ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్లతో తేడాతో చెన్నై ఘన విజయం సాధించింది. దీంతో చెన్నై జట్టు ఎనిమిదిసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది.

తప్పులు జరిగినా పుంజుకున్నాం:

తప్పులు జరిగినా పుంజుకున్నాం:

మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... 'గత ఏడాది కంటే భిన్నంగా ఈ సారి ఫైనల్‌కు చేరుకున్నాం. ఫైనల్‌ చేరాలనే కసితో జట్టు మొత్తం అద్భుతంగా ఆడింది. గత మ్యాచ్‌లో పరుగులు, క్యాచ్‌ల విషయంలో తప్పులు జరిగాయి. అయినా పుంజుకున్నాం. 140కి పైగా పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించడం బాగుంది. మ్యాచ్ ముందుగా మొదలవ్వడంతో పిచ్ కొద్దిగా తడిగా ఉంది. ఇది మా బౌలర్లు ఉపయోగించుకున్నారు. ఇలాంటి సమయంలో పరుగులు చేయడం చాలా కష్టం' అని ధోనీ తెలిపారు.

వికెట్లు తీయడం చాలా ముఖ్యం:

వికెట్లు తీయడం చాలా ముఖ్యం:

'మా బౌలర్లు ఢిల్లీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటింగ్‌ చాలా బలంగా ఉంది. ఓపెనర్లను త్వరగా ఔట్‌ చేయాలనుకున్నాం. ఢిల్లీలో లెఫ్ట్‌ హ్యాండర్స్‌ చాలా మంది ఉన్నారు. వారిని కట్టడి చేసేందుకు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ను వాడి సఫలం అయ్యాం. మైదానం చిన్నగా ఉండటంతో.. త్వరగా వికెట్లు తీయడం చాలా ముఖ్యం. సరైన సమయంలో వికెట్లు తీస్తే.. కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మన్‌ అప్పుడే హిట్టింగ్ చేయలేడు. దీంతో పరుగులు నియంత్రించవచ్చు' అని ధోనీ తెలిపారు.

వారి వల్లే ఫైనల్‌కు చేరాం:

వారి వల్లే ఫైనల్‌కు చేరాం:

'మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టడమే అత్యంత కీలకం. తనకు ఏం కావాలని కెప్టెన్‌ అడుగుతాడు. దానిని బట్టి బౌలర్లు ఎలా బౌలింగ్‌చేయాలి, ఎలా వికెట్లు తీయాలి అన్నది నిర్ణయించుకుంటారు. 40-50 రోజులు బాగా కష్టపడ్డారు. గాయాల బారిన పడినందుకు సంతోషంగా ఉన్నాం. కీలక సమయంలో మా బౌలర్లు అందరూ అద్భుతంగా రాణించారు. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి వాళ్లే ప్రధాన కారణం' అని ధోనీ చెప్పుకొచ్చారు.

ఓపెనర్లే కీలకం:

ఓపెనర్లే కీలకం:

నాకౌట్ మ్యాచ్‌లలో ఓపెనర్లే కీలకం. ఛేదనలో మా ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. అయినా కీలక సమయంలో బ్యాట్ జులిపించి లక్ష్యానికి దగ్గర చేశారు. చివరి వరకూ ఉండి మ్యాచ్‌ ముగిస్తే బాగుండేది. ఏదేమైనా ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉంది' అని ధోనీ పేర్కొన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 11, 2019, 13:15 [IST]
Other articles published on May 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X