న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెన్నునొప్పి గాయం ఎంత పనిచేసింది?: ఐపీఎల్ 2019కి పాండ్యా దూరమేనా?

IPL 2019: Hardik Pandya’s participation in the tournament in doubt after his latest injury

హైదరాబాద్: వెన్నునొప్పి గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్‌కి దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఐపీఎల్ 2019 సీజన్‌కి కూడా దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

1st ODI: తడబడిన టీమిండియా... ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 2031st ODI: తడబడిన టీమిండియా... ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 203

గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ గురువారం తన ట్విట్టర్‌లో పేర్కొంది. హార్ధిక్ పాండ్యాతో వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు.

పాండ్యాకు విశ్రాంతి అవసరం

పాండ్యాకు విశ్రాంతి అవసరం

అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ మెడికల్ సిబ్బంది సూచించడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఐపీఎల్‌కి కూడా హార్దిక్ పాండ్యా దూరమవుతాడనే వార్తలు వస్తున్నాయి. గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే పాండ్యా మైదానం వీడాడు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

ఆ తర్వాత డిసెంబరులో ఫిట్‌నెస్ సాధించిన పాండ్యా జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే సమయంలో ‘కాఫీ విత్ కరణ్' టాక్‌ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సస్పెన్షన్‌కి గురై ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్‌కి దూరమయ్యాడు.

పాండ్యాపై సస్పెన్షన్ ఎత్తివేత

పాండ్యాపై సస్పెన్షన్ ఎత్తివేత

ఆ తర్వాత బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) పాండ్యాపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో పాటు జట్టు విజయాల్లో పాలుపంచుకున్నాడు. ఫిబ్రవరి 24 జరిగే తొలి టీ20తో భారత్-ఆసీస్ జట్ల మధ్య సుదీర్ఘ సిరిస్‌కు తెరలేవనుంది.

జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్న పాండ్యా

జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్న పాండ్యా

వెన్నునొప్పి చికిత్స కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చేవారం హార్దిక్ పాండ్యా వెళ్లనున్నాడు. ఐపీఎల్ ఆరంభంలోపు పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా ఐపీఎల్‌లో ఆడిస్తే? ఆ ప్రభావం ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో పడే అవకాశం ఉంది.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం

కాగా, మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.

Story first published: Friday, February 22, 2019, 14:18 [IST]
Other articles published on Feb 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X