న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆడుతూ పాడుతూ... బెంగళూరుని మరోసారి ఓడించిన చెన్నై

By Nageshwara Rao
 IPL 2018, Match 35: CSK vs RCB Match Report from Maharashtra Cricket Association Stadium, Pune

హైదరాబాద్: పూణె వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. తాజా విజయంతో ఈ సీజన్‌లో బెంగళూరు మరోసారి చెన్నై పైచేయి సాధించింది.

చెన్నై ఆటగాళ్లలో అంబటి రాయుడు(32), ధోని(31 నాటౌట్) రాణించగా.... షేన్ వాట్సన్(11), సురేశ్ రైనా(25), ధ్రువ్ షోరో(8), బ్రావో (14 నాటౌట్) ఫరవాలేదనిపించారు. తాజా విజయంతో చెన్నై ప్లే ఆఫ్‌కు చేరువ కాగా, రాయల్ ఛాలెంజ్స్ తన ప్లే ఆఫ్‌ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.


15 ఓవర్లకు చెన్నై 89/4
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 128 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధోని (4), డ్వేన్‌ బ్రావో (5) పరుగులతో ఉన్నారు. అంతకముందు కీలక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. అంబటి రాయుడు (32), ధ్రువ్‌ షోరె (8) ఔటయ్యారు. డ్వేన్‌ బ్రావో ఇచ్చిన రెండు క్యాచ్‌లను బెంగళూరు ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం.


నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై
పూణె వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఆరంభంలోనే కీలక వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి వాట్సన్(11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన సురేష్ రైనా(25) ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో సౌతీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత మురుగన్ అశ్విన్ వేసిన 12వ ఓవర్‌లో రాయుడు(32) సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో షోరే(8) మన్‌దీప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధోనీ(1), బ్రావో(1) ఉన్నారు.


6 ఓవర్లకు చెన్నై 42/1
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ నిలకడగా ఆడుతోంది. పవర్‌ ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. ఓపెనర్‌ అంబటి రాయుడు (24) నిలకడగా ఆడుతున్నాడు. సురేశ్‌ రైనా (6) పరుగులతో క్రీజులో ఉన్నాడు.


తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
పూణె వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఆరంభంలోనే కీలక వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన మూడో ఓవర్ ఆఖరి బంతికి వాట్సన్(11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో రాయుడు(9), రైనా(5) ఉన్నారు.


చెన్నై విజయ లక్ష్యం 128

పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బెంగళూరు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ పార్థీవ్ పటేల్ (53: 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడం... కెప్టెన్ విరాట్ కోహ్లి (8), మెక్‌కలమ్ (5), ఏబీ డివిలియర్స్ (1) నిరాశపరిచారు.

దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమైంది. దీంతో చెన్నైకి 128 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు సత్తా చాటారు. చెన్నై బౌలర్లలో జడేజా 3, హర్భజన్ సింగ్ 2, డేవిడ్ విల్లీ, లుంగీ ఎంగిడి తలో వికెట్ తీసుకున్నారు.


చెలరేగిన చెన్నై బౌలర్లు, కష్టాల్లో బెంగళూరు
పూణె వేదికగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంగిడి వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్(5) శార్థూల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ(8) జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అనంతరం డివిలియర్స్(1) హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత పార్థీవ్ పటేల్, మన్‌దీప్ సింగ్‌లు కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ జడేజా బౌలింగ్‌లో మన్‌దీప్(7) విల్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి పార్థీవ్ పటేల్ జడేజా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ వెంటనే మురుగన్ అశ్విన్(1) హర్భజన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత గ్రాండ్‌హోం కూడా విల్లీ బౌలింగ్‌లో రైనాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్(1)ని డేవిడ్ విల్లీ రనౌట్ చేశాడు. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో సౌథీ(11), మహమ్మద్ సిరాజ్(0) పరుగులతో ఉన్నారు.


14 ఓవర్లకు బెంగళూరు 87/6
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంటోంది. హాఫ్ సెంచరీ సాధించిన పార్థివ్‌ పటేల్‌ (53)ను 12.5వ బంతికి జడేజా ఔట్‌ చేశాడు. ఆ వెంటనే హర్భజన్‌ వేసిన 13.1వ బంతికి మురుగన్‌ అశ్విన్‌ (1; 2 బంతుల్లో)ను ధోనీ స్టంపౌట్‌ చేశాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గ్రాండ్‌హోమ్ (8), సౌథీ(1) పరుగుతో ఉన్నారు. అంతకముందు రవీంద్ర జడేజా మ్యాచ్‌లో తానేసిన తొలి బంతికే విరాట్ కోహ్లీ‌ని క్లీన్ బౌల్డ్ చేసి ఆశ్చర్యపరిచాడు.


11 ఓవర్లకు బెంగళూరు 73/4
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి మన్‌దీప్ సింగ్ (7) పరుగుల వద్ద డేవిడ్ విల్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 11 ఓవర్లకు బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.


మూడు వికెట్లు కోల్పోయిన బెంగళూరు
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. క్రీజులో మన్‌దీప్ సింగ్(1), పార్దీవ్ పటేల్ (39) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఏబీ డి విల్లియర్స్(1), విరాట్ కోహ్లీ(8) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరారు.


6 ఓవర్లకు బెంగళూరు 47/1
ఐపీఎల్‌ 11 సీజన్‌లో బెంగళూరుకు సరైన ఆరంభాలు దక్కడం లేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోయి 47 పరుగులు చేసింది. పార్థివ్‌ పటేల్‌ (31), విరాట్‌ కోహ్లీ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. లుంగి ఎంగిడి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.


3 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 26/1
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. 3 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది. పార్థివ్‌ పటేల్‌ (17), విరాట్‌ కోహ్లీ (2) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతకముందు ఓపెనర్ మెక్‌కలమ్‌ (5) ఔటయ్యాడు.


తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంగిడి వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్(5) శార్థూల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీదులో పార్థీవ్(10), కోహ్లీ(0) ఉన్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు-చెన్నై జట్లు తలపడుతున్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ మూడు మార్పులతో బరిలోకి దిగాయి.

డుప్లెసిస్, కర్ణ్ శర్మ, ఆసిఫ్‌పై వేటు వేసిన చెన్నై జట్టు వారి స్థానాల్లో డేవిడ్ విల్లీ, ధ్రువ్, శార్ధూల్ ఠాకూర్‌ని తుది జట్టులోకి తీసుకోగా.. డికాక్, మనన్ వోహ్రా, మురగన్ అశ్విన్ స్థానంలో ఏబీ డివిలియర్స్, పార్థీవ్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో చోటు కల్పించాడు.

జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్‌లకీ దూరమైన ఏబీ డివిలియర్స్ ఫిటెనెస్ సాధించి మళ్లీ బెంగళూరు తుది జట్టులో చోటు దక్కించుకోగా... మరో ఓపెనర్ డికాక్.. దక్షిణాఫ్రికాలో ఓ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు స్వదేశానికి వెళ్లడంతో ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.

ఈ సీజన్‌లో ఇప్పటికే ఇరు జట్ల ఒకసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ధోని 34 బంతుల్లో 70 పరుగులతో చెలరేగడంతో బెంగళూరు ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నైపై ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 167 పరుగుల స్కోరుని కాపాడుకోవడంలో బెంగళూరు సఫలమైంది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1
43445

ఇక, చెన్నై విషయానికి వస్తే టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టకలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి అగ్రస్థానానికి చేరుకోవాలని చెన్నై భావిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 12 పాయింట్లతో పట్టికలో చెన్నై రెండో స్థానంలో కొనసాగుతుండగా... ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 6 పాయంట్లతో బెంగళూరు ఆఖరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది.

జట్ల వివరాలు:
చెన్నై జట్టు:

షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోని, ధ్రువ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, డేవిడ్ విల్లీ, హర్భజన్ సింగ్, ఎంగిడి, శార్ధూల్ ఠాకూర్

బెంగళూరు జట్టు:
పార్థీవ్ పటేల్, మెక్‌కలమ్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, గ్రాండ్‌ హోమ్, టిమ్ సౌథీ, మురగన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్

Story first published: Saturday, May 5, 2018, 19:55 [IST]
Other articles published on May 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X