ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అమెరికా సంచలనం!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మంగళవారం ప్రకటించిన తాజా జాబితా ప్రకారం.. టీమిండియా ప్రపంచ నంబర్-1 స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఆ ఘనతతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రస్తుతం 275 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1గా కొనసాగుతోంది.
ఈ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లాండ్ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా పాయింట్ల తేడా చాలా తక్కువగా ఉండటం గమనార్హం. మే 2025 తర్వాత ఆడిన మ్యాచ్‌లకు 100 శాతం.. అంతకుముందు రెండేళ్ల మ్యాచ్‌లకు 50 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ర్యాంకింగ్స్‌ను నిర్ణయించినట్లు ఐసీసీ వెల్లడించింది. మొదటి ఏడు స్థానాల్లో ఎటువంటి మార్పులు లేవు. న్యూజిలాండ్ (4), దక్షిణాఫ్రికా (5), పాకిస్థాన్ (6), వెస్టిండీస్ (7) తమ స్థానాలను కాపాడుకున్నాయి.

అయితే ఎనిమిదో స్థానం కోసం జరిగిన పోరులో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. శ్రీలంక 6 రేటింగ్ పాయింట్లను కోల్పోయి 9వ స్థానానికి పడిపోగా.. బంగ్లాదేశ్ (225 పాయింట్లు) ఓ మెట్టు పైకి ఎగబాకి 8వ స్థానాన్ని దక్కించుకుంది. అఫ్గానిస్థాన్ 220 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. మరోవైపు ఉత్తర అమెరికాలో క్రికెట్ ఎదుగుదలకు నిదర్శనంగా అమెరికా జట్టు ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకుంది. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి జట్లను వెనక్కి నెట్టి అమెరికా ఈ ఘనత సాధించడం విశేషం.
చివరగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో జట్ల సంఖ్య 102 నుంచి 98కి తగ్గింది. గత మూడేళ్లలో కనీసం ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని కారణంగా ఫిజీ, గాంబియా, గ్రీస్, ఇజ్రాయెల్ జట్లు ఈ జాబితా నుంచి తప్పుకున్నాయి. జింబాబ్వే (11), ఐర్లాండ్ (12) స్థానాల్లో ఉండగా, నేపాల్ (17), ఓమన్ (19) జట్లు ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకున్నాయి. కెనడా జట్టు 20వ స్థానంలో నిలిచింది. టీమిండియా తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే మరికొంత కాలం అగ్రస్థానంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఇలా..
1. భారత్
2. ఇంగ్లాండ్
3.ఆస్ట్రేలియా
4. న్యూజిలాండ్
5. దక్షిణాఫ్రికా
6.పాకిస్థాన్
7.వెస్టిండీస్
8. బంగ్లాదేశ్
9.శ్రీలంక
10. అఫ్గానిస్థాన్
11.జింబాబ్వే
12.ఐర్లాండ్
13.అమెరికా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications